మరొక యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సెట్ చేసుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఫైటర్ అనే ఆ సినిమాపై ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. అదే సినిమాతో స్ట్రాంగ్ హిట్టు కొట్టాలని విజయ్ కూడా కష్టపడుతున్నాడు.

ఎందుకంటే విజయ్ ఇంతకుముందు చేసిన సినిమాలు దారుణంగా దెబ్బకొట్టాయి. డియర్ కామ్రేడ్ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆ సినిమా తరువాత చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ అయితే విజయ్ కెరీర్ లోనే మరొక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ విధంగా వరుస అపజయాలు వస్తుండడంతో కథల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేసేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Vijay devarakonda next movie with director shiva nirvana

నిన్ను కోరి - మజిలీ వంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ చేత దిల్ రాజు విజయ్ కి కథ చెప్పించారట. కథలో మెయిన్ పాయింట్ నచ్చడంతో విజయ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఫైటర్ సినిమా తరువాత విజయ్ శివ నిర్వాణ కాంబినేషన్ లో మూవీ రూపొందే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ దర్శకుడు నానితో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X