విజయ్ దేవరకొండ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్.. పాన్ ఇండియా కాదు.. అంతకుమించి!

విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీపై మొత్తానికి ఒక అప్డేట్ వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసేందుకు డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు.

ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

హై వోల్టేజ్ కాంబినేషన్

హై వోల్టేజ్ కాంబినేషన్

ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ సినిమా తరువాత దర్శకుడు పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమా చేస్తాడు అనుకున్న తరుణంలో సడన్ గా విజయ్ దేవరకొండతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు అనగానే ఒక్కసారిగా అభిమానులు ఎగిరి గంతేశారు. ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా హై వోల్టేజ్ లో ఉంటుందని ఒక స్పెషల్ బజ్ క్రియేట్ అయ్యింది.

నెవర్ బిఫోర్ అనేలా..

నెవర్ బిఫోర్ అనేలా..

ఇక సినిమా సెట్స్ పైకి వచ్చి ఏడాది అవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రంగంలోకి దిగిన తరువాత సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా మారిన విషయం తెలిసిందే. ఇక నెవర్ బిఫోర్ అనేలా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల మరొక అప్డేట్ ఇచ్చారు. సినిమాను పూరి కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్. సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఫస్ట్ లుక్ టైటిల్ ఎప్పుడంటే..

ఫస్ట్ లుక్ టైటిల్ ఎప్పుడంటే..

ఇక సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ను జనవరి 18న 10గంటల 08నిమిషాలకు రివీల్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా క్లారిటి ఇచ్చేశారు. ఈ అప్డేట్ సినిమాపై అంచనాల డోస్ ను మరింత పెంచేలా ఉంటుందని సమాచారం. ఇక భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుందట. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

టైటిల్ అయితే అదే..

టైటిల్ అయితే అదే..

ఇక సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ మొదటిసారి ఒక సినిమా కోసం చాలా రోజుల నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఆయనకు ఇదే ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో కేవలం ఆడియెన్స్ అనే కాకుండా సినీ ప్రముఖులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపధ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X