విజయ్ దేవరకొండ రేంజ్ ఇంతలా పెరిగిపోయిందా.! రౌడీ హీరో కోసం వాళ్లిద్దరూ రిస్క్ చేస్తారా.?

By Manoj Kumar P

విజయ్ దేవరకొండ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరో. మొదటి సినిమా 'పెళ్లి చూపులు'లో డీసెంట్‌గా కనిపించిన ఈ క్రేజీ హీరో.. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో తనలోని వైల్డ్ యాంగిల్‌ను చూపించాడు. ఈ రెండు సినిమాలకు తోడు 'గీత గోవిందం' వంటి హిట్‌తో విజయ్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో అతడి మార్కెట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ దేవరకొండ క్రేజ్‌ను నిరూపించే ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే..

సినిమా ఆడకున్నా.. విజయ్‌కు పేరొచ్చింది

సినిమా ఆడకున్నా.. విజయ్‌కు పేరొచ్చింది

గత ఏడాది విజయ్ దేవరకొండ చేసిన ‘డియర్ కామ్రేడ్' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల మనసు దోచుకోలేకపోయింది. కానీ, ఈ సినిమా విజయ్‌కు రష్మికకు మంచి పేరును తీసుకొచ్చింది.

ఒకే టికెట్‌పై నాలుగు సినిమాలు చూపిస్తాడట

ఒకే టికెట్‌పై నాలుగు సినిమాలు చూపిస్తాడట

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ నటిస్తున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు సమర్పిస్తున్న ఈ మూవీని క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో విజయ్ నాలుగు పాత్రల్లో కనిపించనున్నాడు.

క్రేజీ డైరెక్టర్‌తో రౌడీ హీరో సినిమా ఫిక్స్

క్రేజీ డైరెక్టర్‌తో రౌడీ హీరో సినిమా ఫిక్స్

‘వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత విజయ్ దేవరకొండ.. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్నాడు. ‘ఫైటర్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను చార్మీతో కలిసి పూరీ స్వయంగా నిర్మించనున్నాడు. వీరితో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నారు. దీనిని పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారు.

విజయ్ రేంజ్ ఇంతలా పెరిగిపోయిందా.!

విజయ్ రేంజ్ ఇంతలా పెరిగిపోయిందా.!

ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా బడ్జెట్ మొదట అనుకున్నది రూ. 35 కోట్లు మాత్రమేనట. అందులో విజయ్ రెమ్యూనరేషన్‌ రూ. 10 కోట్లు అని ప్రచారం జరిగింది. అయితే, దీన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని అంటున్నారు.

రౌడీ హీరో కోసం వాళ్లిద్దరూ రిస్క్ చేస్తారా.?

రౌడీ హీరో కోసం వాళ్లిద్దరూ రిస్క్ చేస్తారా.?

మొదట తక్కువ బడ్జెట్ అనుకున్నప్పటికీ.. ఐదు భాషల్లో తెరకెక్కించాలనుకోవడం.. జాన్వీ కపూర్ సహా పెద్ద పెద్ద పేర్లు ఉన్న నటీనటులను ఎంపిక చేసుకుంటుండడం సహా పలు అంశాల వల్ల ఈ సినిమా బడ్జెట్ రెట్టింపు అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పూరీ, చార్మీ రిస్క్ తీసుకుంటారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X