విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు

'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ అవడంతో.. అతడికి మంచి పేరు వచ్చింది. దీని తర్వాత 'అర్జున్ రెడ్డి' మూవీతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని విజయ్.. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. అయితే, ఈ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నాడీ యంగ్ హీరో. ఈ నేపథ్యంలో అతడు ఏకంగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రం 'లైగర్'. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేరవకొండ బాక్సింగ్ గ్లౌజ్‌లు వేసుకుని కనిపిస్తుండగా.. అతడి వెనుక ఒక సింహం, పెద్ద పులి కలిసి ఉన్న ఫొటో కూడా ఉంది. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన హీరో విజయ్.. 'మా పాన్ ఇండియా సినిమాను సగౌరవంగా ప్రకటిస్తున్నాం. దేశ వ్యాప్తంగా మ్యాడ్‌నెస్ రావడం గ్యారెంటీ' అంటూ అందులో రాసుకొచ్చాడు. దీంతో ఈ పిక్‌కు విపరీతమైన స్పందన వస్తోంది.

Vijay devarakondas Liger Firast Look Released

ఇదిలా ఉండగా, వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతోన్న విజయ్ దేవరకొండ ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్, ఛార్మీలతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా నిర్మిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ ఏడాది మధ్యలో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X