Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. స్పెషల్ డేన గ్లిమ్స్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే!

విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఈ యంగ్ టాలెంటెడ్ స్టార్ కొంత కాలంగా తన హవాను చూపిస్తున్నాడు. హీరోగా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్న అతడు.. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అదే సమయంలో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకోవడంతో పాటు నేషనల్ లెవెల్‌లో గుర్తింపును సైతం దక్కించుకున్నాడు. ఇక, ఇప్పుడు 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమాను చేస్తోన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ దేవరకొండ సినిమా నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

హిట్ కోసం విజయ్ ఎదురు చూపులు

హిట్ కోసం విజయ్ ఎదురు చూపులు

'పెళ్లి చూపులు' అనే సినిమాతో విజయ్ దేవరకొండ హీరోగా పరిచయమయ్యాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీని తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అనంతరం 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి హిట్లను అందుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులను చవి చూస్తూ విజయం కోసం ఎదరు చూస్తున్నాడు.

డైనమిక్ డైరెక్టర్‌తో కలిసిన రౌడీ స్టార్

డైనమిక్ డైరెక్టర్‌తో కలిసిన రౌడీ స్టార్

సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

హాలీవుడ్ రేంజ్‌లో.. స్పెషల్ రోల్‌లో

హాలీవుడ్ రేంజ్‌లో.. స్పెషల్ రోల్‌లో

బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందని తెలిసింది.

విజయ్ ఫ్యాన్స్‌లో అదొక్కటే నిరాశ

విజయ్ ఫ్యాన్స్‌లో అదొక్కటే నిరాశ

'లైగర్' మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ పలు ఆటంకాలు ఎదురు కావడం వల్ల ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఇటీవలే స్పీడు పెంచిన యూనిట్ వరుసగా షెడ్యూళ్లను జరుపుకుంటోంది. ఇక, ఈ చిత్రం నుంచి అప్‌డేట్లు పెద్దగా రావడం లేదు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్న విషయం తెలిసిందే.

హీరో అభిమానులకు డబుల్ ట్రీట్

హీరో అభిమానులకు డబుల్ ట్రీట్

పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రాబోతున్న 'లైగర్' మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ రాబోతున్నట్లు రెండు రోజులుగా ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి రెండు ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులకు డబుల్ ట్రీట్ వచ్చినట్లైంది.

గ్లిమ్స్ వీడియో.. రిలీజ్ డేట్ ప్రకటన

గ్లిమ్స్ వీడియో.. రిలీజ్ డేట్ ప్రకటన

'లైగర్' మూవీ నుంచి గ్లిమ్స్ వీడియోను న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు, ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా ప్రకటించింది. దీని ప్రకారం.. ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అందులో వెల్లడించారు. దీనిపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X