Liger Glimpse: విజయ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్.. గ్లిమ్స్ వీడియోపై మరో అదిరిపోయే ప్రకటన

ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అతడు.. దీని ద్వారా భారీ హిట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే 'అర్జున్ రెడ్డి' మూవీ మరో భారీ సక్సెస్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో విజయ్ టాలీవుడ్ స్టార్‌గా ఎదిగిపోయాడు. అనంతరం 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఇతగాడు.. ఆ వెంటనే 'టాక్సీవాలా'తో మరో హిట్‌ను కూడా దక్కించుకున్నాడు. దీంతో అతడి కెరీర్‌ గ్రాఫ్‌తో పాటు మార్కెట్ కూడా జెట్ స్పీడుతో దూసుకెళ్లింది. దీంతో అతడు బడా స్టార్‌గా ఎదుగుతున్నాడు.

కెరీర్‌ మొదట్లోనే ఎన్నో విజయాలను అందుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీనికి కారణం ఈ టాలెంటెడ్ హీరో కొంత కాలంగా వరుస పరాజయాలు చవి చూస్తూ నిరాశ పరుస్తుండడమే. ఈ మధ్య కాలంలో 'నోటా' 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు.

Vijay devarakondas Liger Glimpse Date and Time Announced

కొంత కాలంగా భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న టాలీవుడ్ యంగ్ గాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతుండడంతో చాలా కాలం వరకూ టాకీ పార్ట్ మాత్రం కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే గోవాలో ఫైనల్ షెడ్యూల్‌ను మొదలు పెట్టడంతో పాటు వెంటనే దాన్ని పూర్తి చేసేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లైగర్' మూవీకి సంబంధించిన డిసెంబర్ 29న గ్లిమ్స్ వీడియోకు సంబంధించిన డేట్ అండ్ టైమ్ వెల్లడిస్తామని చిత్ర యూనిట్ ముందే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా అనౌన్స్‌మెంట్ వీడియోను వదిలింది. ఇందులో ఈ గ్లిమ్స్ వీడియోను డిసెంబర్ 31, ఉదయం 10:03 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 30న 10:03 గంటలకు బీటీఎస్ స్టిల్‌ను, సాయంత్రం 4 గంటలకు స్పెషల్ ఇన్‌స్టా ఫిల్టర్‌ను కూడా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు చాలా రోజుల పాటు ఈ క్రీడలో శిక్షణ కూడా తీసుకున్నాడు. అలాగే, ఇందులో ఈ యంగ్ హీరో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X