Liger: మళ్లీ షురూ చేసేసిన విజయ్ దేరకొండ.. ఛార్మీ వదిలిన ఫొటోతో క్లారిటీ

చిన్న చిన్న పాత్రలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని ప్రారంభించి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు హైదరాబాద్ కుర్రాడు విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంలోనే తనదైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు భారీ హిట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే 'అర్జున్ రెడ్డి' మూవీ మరో భారీ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో విజయ్ స్టార్‌గా ఎదిగిపోయాడు. అనంతరం 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ రౌడీ గాయ్.. ఆ వెంటనే 'టాక్సీవాలా'తో మరో హిట్‌ను కూడా దక్కించుకున్నాడు. దీంతో అతడి కెరీర్‌ గ్రాఫ్‌తో పాటు మార్కెట్ కూడా జెట్ స్పీడుతో పైకి లేచింది.

కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి కొంత కాలంగా వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీనికి కారణం ఈ టాలెంటెడ్ హీరో ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలు చవి చూస్తూ నిరాశ పరుస్తుండడమే. కొన్నేళ్ల క్రితం వచ్చిన 'నోటా' నుంచి మొదలుకొని.. 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి ఫ్లాపులను చవి చూశాడు. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో ఉన్నాడు.

Vijay devarakondas Liger Movie Final Schedule Started

భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతుండడంతో చాలా కాలం వరకూ టాకీ పార్ట్ మాత్రం కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే గోవాలో ఫైనల్ షెడ్యూల్‌ను మొదలు పెట్టడంతో పాటు వెంటనే దాన్ని పూర్తి చేసేశారు. ఇక, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'లైగర్' మూవీకి సంబంధించిన కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోయిన విషయం తెలిసిందే. దీనికోసం తాజాగా చిత్ర యూనిట్ చిత్రీకరణను పున: ప్రారంభించింది. ఈ మేరకు ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్‌ను జరుపుతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. అంతేకాదు, షూటింగ్ స్పాట్‌లో తీసిన ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. ఇక, ఈ షెడ్యూల్ దాదాపు పది రోజులు జరుగుతుందని తెలుస్తోంది. ఇది కంప్లీట్ అయితే టాకీ పార్ట్ అయిపోతుందని అంటున్నారు.

'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X