VD 10.. ప్రీ లుక్‌తో విజయ్ దేవరకొండ రచ్చ.. రేపే అసలు కథ!
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం విజయ్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. థాయ్‌లాండ్‌లో కొన్ని రోజులు ఉండి శిక్షణ తీసుకున్నాడు. ఇది వరకెన్నడూ కనిపించని విధంగా శరీరాకృతిని మార్చుకుని మరీ కనిపించాడు. అయితే లాక్డౌన్ కంటే ముందుగా ఓ వారం రోజులు షూటింగ్ కూడా జరిపారు. అర్దరాత్రి ముంబై వీధుల్లో రొమాంటిక్ సీన్స్ బాగానేతెరకెక్కించారు.
అయితే ఈ మూవీకి ఫైటర్ అనే వర్కింట్ టైటిల్‌ను పెట్టుకున్నారు. తన ఫైటర్ అని చెప్పడం ప్రతీ సారి అదే పదాన్ని వాడటంతో ఈ మూవీ టైటిల్ కూడా ఫైటర్ అయి ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అది నిజమైన టైటిల్ కాదని ఆ మధ్య చార్మీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ ప్రాజెక్ట్‌పై వచ్చిన రూమర్లను ఛార్మీ ఖండిస్తూ టైటిల్ పేరును ఇంకా ఫిక్స్ చేయలేదని తెలిపింది.

అయితే విజయ్, పూరి కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియన్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రేపు విడుదల కాబోతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతకు మునుపే ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇక ఇందులో బాక్సింగ్ రింగ్‌లో పాయింట్లు చూపించినట్టుగా ఓ పోస్టర్‌నుపెట్టారు. అందులో చేతిక ధరించే గ్లౌవ్స్ ఉన్నాయి. రేపు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రాబోతోందని తెలిపారు.


Click it and Unblock the Notifications











