Liger: బాక్సింగ్ రింగ్‌లో ఊహించని లుక్‌లో విజయ్.. ఫ్యాన్స్‌కు ఛార్మీ సర్‌ప్రైజ్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగిపోయాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ యంగ్ సెన్సేషన్.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో సూపర్ డూపర్ హిట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా చాలా కాలంగా టాలీవుడ్‌లో తన సత్తాను చూపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడీ యంగ్ హీరో.. పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు సైతం రెడీ అవుతున్నాడు. ఇందుకోసం 'లైగర్' అనే సినిమాను చేస్తున్నాడు.
ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న విజయ్ దేవరకొండ.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతుండడంతో ఇప్పటి వరకూ టాకీ పార్ట్ మాత్రం కంప్లీట్ కాలేదు. కోవిడ్ కారణాలతో పాటు మరికొన్ని సమస్యల కారణంగా ఎప్పుడో పున: ప్రారంభం అవ్వాల్సి ఉన్నా ఇది ఇంకా పట్టాలెక్కలేదు.

'లైగర్' మూవీ ప్రారంభానికి ముందే విజయ్ దేవరకొండ ముంబై నగరంలో పలుమార్లు చక్కర్లు కొట్టాడు. దీనికితోడు ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ వంటి బడా డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే, కరణ్ జోహార్ వంటి బడా ఫిల్మ్ మేకర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్, దక్షిణాదిలోని ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ కన్ను కూడా పడింది. అందుకే దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభం అయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ అధికారికంగా తెలియజేసింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'లైగర్' మూవీ షూటింగ్ సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా మొదలైంది. దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చిన ఛార్మీ.. షూటింగ్ స్పాట్‌లోని ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సింగ్ రింగ్‌లో చెమటలు చిందిస్తూ కూర్చుని ఉన్నాడు. అలాగే, అతడు షర్ట్ లేకుండా కనిపించాడు. దీనికితోడు విచిత్రమైన హెయిర్ స్టైల్‌తో దర్శనమిస్తున్నాడు. ఫలితంగా ఈ పిక్‌కు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది.
క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న 'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు చాలా రోజుల పాటు ఈ క్రీడలో శిక్షణ కూడా తీసుకున్నాడు. అలాగే, ఇందులో ఈ యంగ్ హీరో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











