‘లైగర్’ ప్లాన్‌లో మార్పులు: అలా ఫిక్స్ అయిన విజయ్, పూరీ జగన్నాథ్

హీరోగా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒకడు. 'పెళ్లి చూపులు' అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించిన అతడు.. మొదటి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'లో మాత్రం తనలోని మరో యాంగిల్ చూపించాడు. తద్వారా భారీ విజయంతో పాటు ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. దీని తర్వాత కూడా పలు హిట్లను నమోదు చేసుకున్నాడు. అయితే, ఈ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటోన్నాడు.

ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు విజయ్. ఇందుకోసం టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్, ఛార్మీలతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా నిర్మిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న ఈ మూవీ టైటిల్ పోస్టర్‌తో పాటు విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

Vijay devarakondas Liger Shoot Start From February

అప్పుడెప్పుడో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సీన్లను చిత్రీకరించారు. అయితే, ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో హైదరాబాద్‌లోనే ముంబై సెట్ వేసి చిత్రీకరణ కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభం కాబోతుందట. ఇది జరిగేది హైదరాబాద్‌లో కాదు.. ముంబైలోనే. అవును.. అందుకు తగిన ఏర్పాట్లను కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే పూర్తి చేసినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X