ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచుతా.. అదేమన్నా వ్యాపారమా?: విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే 'వరల్డ్ ఫేమస్ లవర్' గా ముగ్గురు అందాల భామలతో రొమాన్స్ చేసిన ఈ యంగ్ హీరో మరో అద్భుతమైన ఫీట్ సాధించాడు. హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ మెన్గా టాప్ హీరోలను సైతం వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ మీడియాతో ముచ్చటించిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన సినిమాలు, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన ఆయన ప్రేమ సంగతులపై కూడా రియాక్ట్ అయ్యాడు. ''నేను ప్రేమలో పడినా సరే ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచుతాను. అది నా వ్యక్తిగత వ్యవహారం. దాని గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు'' అన్నాడు.

Vijay Deverakonda reaction on his love

ప్రేమ అనేది వ్యాపారం కాదని, తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ విషయాలు చెబుతానని అన్నాడు విజయ్. సందర్భం వస్తే ఏదో రోజు ప్రపంచానికీ చెబుతానని.. కానీ, దానికి సమయం ఉందని తెలిపాడు. తన జీవితం వేరొకరికి వినోదంగా మారడం ఇష్టం ఉండదని ఆయన అన్నాడు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ మూవీ.. కారోనా కారణంగా కొద్ది రోజులపాటు షూటింగ్ వాయిదా వేసుకుంది. చిత్రంలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X