పూరి జగన్నాథ్ సంగతి పక్కన పెడితే.. చిరంజీవితో పూర్తి కాగానే.. విజయ్ దేవరకొండ
Recommended Video
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ వేరు. సినిమాల్లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఫాన్స్‌గా మలచుకున్నాడు ఈ రౌడీ స్టార్. ''అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా'' లాంటి వరుస హిట్స్ ఆయన్ను ఓ రేంజ్ లోకి తీసుకెళ్లాయి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా 'డియర్ కామ్రేడ్'. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. తన తదుపరి సినిమాల విషయమై కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.

బిజీ షెడ్యూల్‌లో విజయ్..
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. తీరిక లేని షెడ్యూల్స్‌తో గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో డియర్ కామ్రేడ్ సినిమాను పూర్తిచేసి.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా సహా మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు.

విజయ్ నెక్స్ట్ ప్రాజెక్టులు ఇవే..
క్రాంతి మాధవ్ తో సినిమా పూర్తికాగానే విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. పూరి జగన్నాథ్ తో ఓ సినిమా, అలాగే కొరటాల శివతో మరో సినిమా వెంటవెంటనే చేయనున్నాడని అన్నారు. కాగా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఇలాంటి వార్తలపై స్పందించాడు విజయ్ దేవరకొండ.

చిరంజీవితో పూర్తికాగానే..
తాను పూరి, కొరటాల శివలతో సినిమాలు చేయబోతున్నాని వార్తలు వస్తున్నాయని, అయితే పూరి జగన్నాథ్ తో సినిమా గురించి ఏమీ అనుకోలేదని, అస్సలు అలాంటి ఆలోచన కూడా రాలేదని చెప్పాడు. ఇక డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయాలని ఉన్న మాట వాస్తవమే అని, కాకపోతే కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ సినిమా ఫినిష్ కాగానే మా ఇద్దరికీ వీలు కుదిరితే అప్పుడు ఆలోచిస్తామని విజయ్ దేవరకొండ ఓ క్లారిటీ ఇచ్చాడు.

డియర్ కామ్రేడ్ మూవీ
విజయ్ దేవరకొండ ప్రెసెంట్ మూవీ డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. జులై 26 వ తేదీన డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











