యంగ్ హీరోయిన్, ఛార్మిలతో విజయ్ దేవరకొండ ఎంజాయ్.. సోషల్ మీడియాలో వైరల్ పిక్స్
ఇటు హీరోయిన్ అనన్య పాండే, అటు నిర్మాత ఛార్మి.. ఇద్దరి మధ్యలో మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఇక ఆ పక్కనే మన డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్.. ఇలా అందరూ కలిసి ముంబైలో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. వీళ్ళందరూ భాగమై చేస్తున్న సినిమా ఫైటర్ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అంతా కలిసి పార్టీ చేసుకున్నారు.

గ్రాండ్ పార్టీ.. హీరోయిన్‌తో విజయ్ దేవరకొండ
సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ మొత్తం కూడా ముంబైలోనే పూర్తిచేసిన చిత్రయూనిట్.. అది విజయవంతంగా పూర్తిచేసి ముంబైకి బై బై చెప్పింది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే, నిర్మాత ఛార్మి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంతా కలిసి గ్రాండ్ పార్టీ చేసుకున్నారు.

స్టార్ హోటల్‌లో అందరూ కలిసి..
ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో అందరూ కలిసి లాస్ట్ డే ఈవెనింగ్ ఎంజాయ్ చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోల్లో విజయ్ సహా చిత్రయూనిట్ అంతా హుషారుగా కనిపిస్తోంది. ఛార్మి, అనన్యలతో కలిసి మంచి జోష్‌లో కనిపిస్తున్నాడు మన విజయ్ దేవరకొండ.

ఫోటోలు షేర్ చేసిన ఛార్మి.. నెట్టింట వైరల్
ఈ మేరకు ఈ పార్టీలో దిగిన పిక్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఛార్మి.. ''మీ అందరితో పార్టీ ఫుల్లుగా ఎంజాయ్ చేశా. అందమైన సాయంత్రాన్ని అందమైన మనుష్యులతో సరదాగా గడిపా'' అంటూ ట్యాగ్ చేసింది. దీంతో ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ఖుషీ అవుతూ 'ఫైటర్' హిట్ ఖాయం అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
Recommended Video


రొమాంటిక్ డోస్.. బైక్ మీదే అలా!
ఇకపోతే ఈ ఫైటర్ సినిమాలో రొమాంటిక్ డోస్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్ నుంచి బయటకొచ్చిన పిక్స్ చెప్పేశాయి. విజయ్ దేవరకొండ, అనన్య పాండే బైక్ మీదే రెచ్చిపోయి రొమాన్స్ చేస్తూ కనిపించడంతో యూత్ ఆడియన్స్‌లో ఆత్రుత మొదలైంది.
పూరి, ఛార్మి సంయుక్తంగా..
శ్రీమతి లావణ్య సమర్పణలో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నాడు. బాక్సింగ్ సన్నివేశాల్లో రియాలిటీ ఉట్టిపడేందుకు గాను ఆయన శిక్షణ కూడా తీసుకున్నాడు. ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











