అనన్య పాండే పక్కన నిలబడితే అలాంటి ఫీలింగ్.. విజయ్ దేవరకొండ మనసులో మాట

సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దక్షిణాది ప్రేక్షకులే కాదు.. ఉత్తరాది ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను హై ప్రయారిటీతో బడ్జెట్‌కు భయపడకుండా ఏకకాలంలో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలుగా కరణ్ జోహర్, చార్మీ కౌర్ వ్యవహరిస్తున్నారు.

లైగర్ షూటింగ్ కోసం ముంబైలో ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనన్య పాండేపై ప్రశంసల వర్షం కురిపించారు. అనన్యకు కేవలం 22 ఏళ్లే. కానీ వేరి టాలెంటెడ్ యాక్ట్రస్. అనన్య పక్కన ఉంటే నేను కొత్త నటుడిననే ఫీలింగ్ అసలే అనిపించదు. నేను హైదరాబాద్‌లో ఉంటే కింగ్‌లా ఉంటాను. అనన్య పక్కన ఉంటే సీనియర్‌ అనే ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా ఆమె కంటే ఎక్కువ వయసు అనే ఫీలింగ్ కలుగుతుంది అని విజయ్ దేవరకొండ అన్నారు.

 Vijay Deverakonda teases Ananya Panday amid Liger shoot

అలాగే కరణ్ జోహర్‌కు సంబంధించిన ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌లో నటించడం చాలా కంఫర్ట్‌గా ఉంది. ఆ బ్యానర్‌లో అవకాశం రావడం లక్కీ.. భవిష్యత్‌లో కూడా నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను అని విజయ్ దేవరకొండ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X