twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినరా సోదర వీరకుమారా అంటున్న పూరీ జగన్నాథ్

    |

    పూరి జగన్నాధ్ చేతుల మీదుగా''వినరా సోదర వీరకుమారా!'' ఫస్ట్ లుక్ విడుదలశ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వంలో లక్ష్మణ్ క్యాదరి నిర్మిస్తున్న చిత్రం 'వినరా సోదర వీరకుమారా!'. ఈ చిత్ర ఫస్ట్ ‌లుక్‌ను డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''వినరా సోదర వీరకుమారా! చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది అని అన్నారు.

    దర్శకుడు సతీష్‌కి మొదటి సినిమా ఇది. కథ మొత్తం నాకు చెప్పాడు. చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. ఇప్పుడు యూత్‌కి కావాల్సిన సినిమా. సతీష్ ఈ చిత్రాన్ని ట్రీట్ చేసిన విధానం నాకు ఎంతగానో నచ్చింది. ఆయన కథ చెబుతుంటే నాకు సినిమా మొత్తం కనిపించింది. అంత చక్కగా కథ చెప్పాడు. డైరెక్టర్ సతీష్, నిర్మాత లక్ష్మణ్, హీరో శ్రీనివాస్ సాయి.. ఇంకా చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూరి జగన్నాథ్ అన్నారు.

    Vinara Sodara Veera Kumara first look launched by Puri Jagannadh

    నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ..''ముందుగా మా చిత్ర ఫస్ట్ ‌లుక్‌ని విడుదల చేసిన పూరీగారికి మా చిత్ర యూనిట్ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యూత్ ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. మా దర్శకుడు సతీష్ చంద్ర అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఫస్ట్ కాపీ రెడీ అయింది. మొత్తం ఇందులో ఐదు పాటలుంటాయి. శ్రవణ్ భరద్వాజ్ మంచి పాటలు ఇచ్చారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..'' అన్నారు.

    Vinara Sodara Veera Kumara first look launched by Puri Jagannadh

    శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కెమెరా: రవి. వి, మాటలు-పాటలు: లక్ష్మీ భూపాల, ఎడిటింగ్: మార్తండ్. కె. వెంకటేష్, ఫైట్స్: రాబిన్ సుబ్బు, డ్యాన్స్: అజయ్ సాయి, ఆర్ట్: లక్ష్మీ సింధూజ గ్రంథి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనీల్ మైలాపురం, నిర్మాత: లక్ష్మణ్ క్యాదారి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సతీష్ చంద్ర నాదెళ్ళ.

    English summary
    Debut Director Satish Chandra Nadella's movie is Vinara Sodara Veera Kumara. This movies first look launched by popular Director Puri Jagannadh. In this occassion, Puri wishes good luck to entire team.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X