ఆ సినిమా పేరెత్తడానికి ఇష్టపడని విజయ్ దేవరకొండ.. ఆ ఇద్దరిపై అంత కోపమా?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులతో సాగిపోతున్నది. అయితే ఇటీవల కాలంలో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ కావడం కొంత అభిమానులను కంగారు పెడుతున్నది. అయితే విజయ్ దేవరకొండ ఎక్కువగా అంచనాలు పెట్టుకొన్న లైగర్ మూవీ తీవ్రమైన నిరాశను ఆయనే కాకుండా అభిమానులకు కూడా కలిగించింది. లైగర్ కొట్టిన దెబ్బ కేవలం విజయ్ దేవరకొండకు మాత్రమే కాకుండా డిస్టిబ్యూటర్లకు గట్టిగానే అందరికి తగిలింది. అయితే లైగర్ మిగిల్చిన చేదు అనుభవాన్ని విజయ్ ఎప్పుడూ బయటకు వ్యక్తం చేయలేదు. కానీ ఖుషి మ్యూజికల్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆ సినిమా ఎంతటి నిరాశకు గురిచేసిందనే విషయం స్పష్టమైంది. అయితే ఖుషి ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తన మనసులోని మాటను ఎలా బయటపెట్టారంటే?
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మీ కౌర్ ఓ నిర్మాతగా రూపొందిన సినిమా లైగర్. ఆ సినిమా అనేక విషయాలు, ప్రత్యేకతలతో మొదటి నుంచి భారీగానే అంచనాల పెంచుకొంటూ పోయింది. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో మోత మోగించింది. విజయ్ దేవరకొండకు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎవరూ ఊహించని క్రేజ్ క్రియేట్ చేసింది. లైగర్ విజయం సాధిస్తే.. బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది.

లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా రకాలుగా త్యాగాలకు సిద్దపడ్డారు. ఒకట్రెండు సంవత్సరాలు ఒంటిని గుల్ల చేసుకొన్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం కఠోరమైన ఆహార నియమాలు పాటించాడు. లైగర్ సినిమాను అంతగా ప్రేమించి చేశాడు. అంతేకాకుండా పూరీ తనకు పంపించిన కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను సినిమా కోసం ఖర్చు చేయమని విజయ్ దేవరకొండ తిరిగి పంపించాడు. అంతగా లైగర్ సినిమాను తన ప్రపంచంగా మలుచుకొన్నాడు.

అయితే లైగర్ సినిమా రిలీజ్ తర్వాత మిగిల్చిన చేదు అనుభవం అంతా ఇంతా కాదు. తన అంతగా నమ్ముకొన్న సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందడం జీర్ణించుకోవడం అభిమానులకు చాలా కష్టంగా మారింది. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండకు రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం పక్కన పెడితే.. ఆయన సిబ్బంది ఫోన్ చేస్తే ఛార్మీ తదితరులు కనీసం స్పందించిన పరిస్థితులు కూడా ఉన్నాయని సినీ, మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది.
సమంత, చైతులా మరో హీరో హీరోయిన్ జంట విడాకులు... వేణుస్వామి సంచలనం
ఇలాంటి విషయాలు జరిగినా.. లైగర్ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ ఎప్పడు తన అసహనాన్ని, అసంతృప్తిని బయట పెట్టలేకుండా సంయమనం పాటించారు. జరిగిందేదో జరిగింది. జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. చేసేది ఏమీ లేదంటూ మరో సినిమా, కెరీర్‌పై గట్టిగా దృష్టిపెట్టారు. అయితే అయితే లైగర్ సినిమా పేరు ఎత్తడానికి ఇష్టపడని విధంగా తనలో అసంతృప్తి ఉందనే విషయం ఖుషీ ఈవెంట్‌లో స్పష్టమైంది.

లైగర్ పాప సరికొత్త అందాల అస్త్రం.. ఆ పరువాల ప్రదర్శనకు సాటి ఎవ్వరు?
ఖుషీ మ్యూజికల్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..ఖుషి సినిమా షూట్ జరుగుతున్న సమయంలో సమంత అనారోగ్యానికి గురైంది. అయితే తాను ఆమె త్వరలోనే కోలుకొంటుందని అనుకొన్నాం. కానీ తీవ్రత ఎక్కువ కావడంతో షూటింగ్ ఆపివేశాం. ఆ సమయంలో నేను మరో సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లిపోయాను అంటూ విజయ్ చెప్పాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నోటి వెంట లైగర్ ప్రస్తావన రాకపోవడంతో ఆయనకు ఆ సినిమా ఎంత అయిష్టంగా ఉందనే విషయం స్పష్టమైంది అంటూ సోషల్ మీడియాలోను, మీడియాలోను చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











