పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ మూవీ మొదలయ్యేదెప్పుడు?
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పూరి, చార్మి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. డియర్ కామ్రేడ్ మూవీ వరకు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిన విజయ్ దేవరకొండ... 'డియర్ కామ్రేడ్' ప్లాప్ దెబ్బతో సీనియర్ డైరెక్టర్లతో చేయాలని డిసైడ్ అయ్యాడు. అదే సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం అందుకుని ఫాంలోకి వచ్చిన పూరి నుంచి ఆఫర్ రావడంతో వెంటనే ఒకే చెప్పేశాడు.
ఈ సినిమా ఎప్పుడు మొదలువుతుంది? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనే అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ నవంబర్లో మొదలవుతుందని, 2020 సమ్మర్ లేదా అంతకంటే ముందే రిలీజ్ అయ్యలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. పూరి షూటింగ్ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కసారి మొదలు పెడితే అంతా పర్ఫెక్టుగా పూర్తవుతుంది.

ఈ చిత్రానికి పూరి దర్శకత్వం వహించబోతున్నారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బేనర్లో పూరి, చార్మి నిర్మాతలుగా శ్రీమతి లావణ్య సమర్పణలో ఈ మూవీ రాబోతోంది. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నట్లు చార్మి తెలిపారు.
'ఇస్మార్ట్ శంకర్' విజయంతో మంచి ఊపుమీదున్నాడు పూరీ జగన్నాథ్... విజయ్ దేవరకొండతో అంతకు మించిన మాస్ మూవీని తెరక్కించే ప్లాన్లో ఉన్నాడు. ఇందు కోసం పూరీ పక్కా మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











