మహేష్ బాబు నిజస్వరూపం అదే.. ఫ్లాప్ పడితే.. పూరీ జగన్నాధ్ షాకింగ్ కామెంట్స్

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరో పరిచయం కావాలన్నా.. అప్పటికే సెటిల్ అయిన హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టాలన్నా పూరీ తర్వాతనే అని చెప్పాలి. ఎందుకంటే పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన సినిమాలు అలాంటివి. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బన్నీ, రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి టాలీవుడ్ రత్నాలతో పనిచేశారాయన. వారి కోసం సెపరేట్ క్యారెక్టరైజేషన్స్ డిజైన్స్ చేసి మరీ మాస్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టడంలో ఆయన వంతు కృషి చేశారు.

అయితే ఇప్పుడు పూరీ జగన్నాధ్ తో సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆడియెన్స్ అంటూనే ఉన్నారు. ముఖ్యంగా పూరీ జగన్నాధ్ - మహేశ్ బాబు కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కే కాదు.. తెలుగు ఆడియెన్స్ కు కూడా హైప్ నిస్తుంది. వీరి కాంబోలో వచ్చిన 'పోకిరి' ఇప్పటికీ కల్ట్ మూవీగా నిలిచింది. ఈ తరం ఆడియెన్స్ కు కూడా పిచ్చి పిచ్చిగా నచ్చుతుందంటే మాములు విషయం కాదు. ఆ తర్వాత 'బిజినెస్ మ్యాన్'లో గూస్ బంప్ప్ తెప్పించే డైలాగ్స్ ను మహేశ్ నోట చెప్పించారు. దీంతో వీరి కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

Why Mahesh babu not giving chance to Puri Jagannadh Here is Director Shocking Answer

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29 వర్క్ టైటిల్ తో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి వీరి కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఇండియాలోనే కాదు.. వరల్డ్ మార్కెట్ లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంతో.. మహేశ్ బాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. కాగా పూరీ - బాబు కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వడం లేదనే ప్రశ్న పుట్టుకొచ్చింది.

కొన్నేళ్లుగా పూరీ- మహేశ్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు... ఎందుకు సెట్ అవ్వడం లేదనే దానికి పూరీ జగన్నాథ్ ఎప్పుడో సమాధానం ఇచ్చారు.... 'మహేశ్ నాతో హిట్ పడితే సినిమాలు చేస్తారు. సక్సెస్ లో ఉంటేనే ఓకే చెప్తారు. నేను ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు కూడా మహేశ్ బాబు అభిమానులు మహేశ్ అన్నతో సినిమా ఎప్పుడన్నా? అని అడుతున్నారు. మహేశ్ మాత్రం నేను సక్సెస్ లో ఉంటేనే నాతో సినిమా చేస్తాడు. ఆయన కంటే ఆయన అభిమానులపైనే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. కనీసం వాళ్లు నన్ను ఎంతగానో నమ్ముతున్నందుకు.. మహేశ్ కు నాపై నమ్మకం లేకపోవడంతో కాంబో సెట్ అవ్వడం లేదు.' అని చెప్పుకొచ్చారు.

Why Mahesh babu not giving chance to Puri Jagannadh Here is Director Shocking Answer

'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్'తో ఫ్లాప్స్ అందుకున్న పూరీ జగన్నాథ్ మళ్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు మూడు స్కిట్లు రాసుకునేందుకు ఈసారి గోవాకు వెళ్లినట్టు తెలుస్తోంది. గోపీచంద్ తో డైరెక్ట్ చేసిన 'గోలీమార్'కు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జన గణ మన' కూడా ఆగిపోవడంతో నెక్ట్స్ ఎలాంటి సినిమాను అనౌన్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X