Year Ender 2025: గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాలు ఇవే!

Year Ender 2025: 2025 చివరి దశకు చేరుకున్న సందర్భంగా, ఈ ఏడాది ఏ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా అలరించాయో, ఎలాంటి సినిమాల కోసం దేశవ్యాప్తంగా సెర్చ్ చేశారో గూగుల్ అధికారికంగా వెల్లడించింది. ఇండియాస్ ఇయర్ ఇన్ సెర్చ్ 2025 అనే పేరుతో విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో ఇండియన్ ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాల జాబితా బయటపడింది. మైథాలజీ నుంచి మెగా యాక్షన్ వరకూ, రొమాంటిక్ డ్రామా నుంచి భారీ ఫ్రాంచైజీల వరకూ దేశవ్యాప్తంగా ఏ సినిమాలు అత్యధికంగా ట్రెండ్ అయ్యాయో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..

1. సయ్యారా (Saiyaara)
2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల్లో యశ్ రాజ్ ఫిల్మ్స్ అందించిన 'సయ్యారా' మూవీ టాప్ లో నిలిచింది. ఈ రొమాంటిక్ మూవీకి మోహిత్ సురి దర్శకత్వం వహించారు. ఈ లవ్ స్టోరీలో ఆహాన్ పాండే, అనీత్ పడ్డా కెమిస్ట్రీ దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఎమోషనల్ సాంగ్స్, హై బడ్జెట్ ప్రొడక్షన్ వల్ల విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది.

Year Ender 2025 Top 10 Most Googled Movies in India This Year

2. కాంతార: చాప్టర్ - 1 (Kantara Chapter 1 )
2022లో విడుదలైన కాంతార బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రీక్వెల్ గా వచ్చిన మూవీ కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1. మల్టీ టాలెంట్ యాక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం తెరకెక్కింది. భారతీయ లోకసాహిత్యం, భూత కోలా కల్చర్ వంటి అంశాలపై ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా గురించి గూగుల్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది. విడుదల ముందు నుంచి తర్వాత వరకు స్టోరీ థియరీస్, టీజర్లు అన్నీ వైరల్ అవుతూనే వచ్చాయి.

3. కూలీ (Coolie)
రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూలీ. స్టార్ హీరోస్ కాంబినేషన్స్, ఫైర్ స్టంట్స్‌, భారీ యాక్షన్స్ వల్ల సోషల్ మీడియాలో భారీ క్రేజ్ వచ్చింది. దీంతో సెర్చ్ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది. విడుదల వరకు అప్డేట్స్ కోసం అభిమానులు రజనీ ఫ్యాన్స్ గూగుల్‌లో తెగ వెతికారు.

4. వార్ 2 (War 2 )
యష్ రాజ్ స్పై యూనివర్స్ లో మరో భారీ బడ్జెట్ మూవీ 'వార్ 2'. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ వంటి స్టార్స్ కాంబో ఒకే సినిమాలో నటించారు. దీంతో ఈ మల్టీ స్టారర్‌కి మరో భారీ బజ్ క్రియేట్ అయ్యింది. స్పై యూనివర్స్ క్రాస్‌ఓవర్‌లు, క్యారెక్టర్ కనెక్షన్స్ కోసం ఎక్కువగా సెర్చ్‌ చేశారు.

5. సనమ్ తేరి కసమ్(Sanam Teri Kasam)
టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో 2016లో విడుదలైన సనమ్ తేరి కసమ్ లవ్ స్టోరీ 2025లో రీ రిలీజ్ అయింది. హర్షవర్ధన్ రాణే-మావ్రా హోకేన్ నటించిన 'సనమ్ తేరి కసమ్' వాలెంటైన్స్ సందర్భంగా మళ్లీ విడుదలై సంచలన రికార్డు సృష్టిస్తోంది. ఇండియాలో రీ-రిలీజ్‌లో 50 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమాగా నిలిచింది. దీని ద్వారా 'తుంబాద్' కలెక్షన్‌ను అధిగమించింది. 2016లో రిలీజ్ అయినప్పుడు అంతగా స్పందన రాకపోయినా, ఇప్పుడు 16 రోజుల్లోనే 32 కోట్లకు పైగా, మొత్తం రూ.50 కోట్ల వరకు వసూలు చేసింది.

6. మార్కో (Marco )
ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' వంద కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఇందులో వైలెన్స్ ఎక్కువగా ఉందనే విమర్శలూ వచ్చాయి. అయినప్పటికీ మూవీ సక్సెస్ దృష్ట్యా మేకర్స్ సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'లార్డ్ మార్కో' అనే టైటిల్ రిజిస్టర్ చేసుకోగా, హనీఫ్ అదేని దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళలో విడుదలైన ఈ రివెంజ్ డ్రామా స్ట్రీమింగ్ తర్వాత నేషనల్ లెవెల్‌లో ట్రెండింగ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కావడంతో దేశవ్యాప్తంగా హల్‌చల్ చేసి, అన్ కట్ వెర్షన్స్, బాక్సాఫీస్ రికార్డులపై సెర్చ్‌లు పెరిగాయి.

7. హౌస్‌ఫుల్ 5 (Housefull 5)
బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజీ 'హౌస్‌ఫుల్ 5'. సాజిద్ నదియాద్‌వాలా నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రీతీష్ దేశ్‌ముఖ్, నానా పటేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'Housefull 5A', 'Housefull 5B' అనే రెండు వర్షన్లలో థియేటర్లలోకి వచ్చింది. క్రూయిజ్ నేపథ్యం, మర్డర్ మిస్టరీ, రెండు డిఫరెంట్ ఎండింగ్స్ కారణంగా మూవీపై హైప్ క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

8. గేమ్ ఛేంజర్ (Game Changer)
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్-శంకర్ చిత్రం 'గేమ్ ఛేంజర్'. కానీ, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. శంకర్‌కు ఇది తొలి తెలుగు సినిమా అయినా, మొదటి రోజే నెగటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పడిపోయాయి. అదే సమయంలో రిలీజైన ఇతర సంక్రాంతి సినిమాల పోటీ కారణంగా గేమ్ ఛేంజర్ మధ్యలోనే వసూళ్ల పోరులో చేతులెత్తేసింది.కానీ, ఈ పొలిటికల్ డ్రామా భారీ సెట్స్, మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ప్లానింగ్ కారణంగా గుగూల్ ట్రెండింగ్ లో నిలిచింది.

బిగ్‌బాస్‌కు వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి
9. మిసెస్ (Mrs movie)
సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో రూపొందిన చిన్న సినిమా మిసెస్. జీ5లో స్ట్రీమింగ్ అయిన'మిసెస్' చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటింది. IMDbలో 7.3 రేటింగ్, గూగుల్ యూజర్ రేటింగ్‌లో 4.6/5 స్కోర్ సాధించి టాప్ సెర్చ్‌డ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. జియో స్టూడియోస్-బవేజా స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకి ప్రముఖులు, విమర్శకులు మంచి ప్రశంసలు అందిస్తున్నారు.

10. మహావతార్ నరసింహ (Mahavatar Narsimha )
మిథలాజికల్ నేపథ్యంతో వచ్చిన డివోషనల్ యాక్షన్ మూవీ మహావతార్ నరసింహా. ప్రత్యేక విఎఫ్ఎక్స్‌, భక్తిపరమైన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిసారిగా యానిమేషన్స్ లో రావడంతో ప్రేక్షకులను ద్రుష్టిని ఆకర్షించింది. ఆధ్యాత్మిక అంశాల కారణంగా ఈ సినిమా గురించి తెగ సెర్చ్ చేశారు. 2025లో ఈ సినిమాలు థియేటర్లు మాత్రమే కాదు, గూగుల్ సెర్చ్‌లలో కూడా టాప్‌లో నిలిచాయి. కొత్త సినిమాలే కాదు, గతంలో విడుదలైన సినిమాలు కూడా మళ్లీ ట్రెండ్ అవడం ఈ సంవత్సరం ప్రత్యేకత . ఈ ఇయర్ ఎండర్ ఇండియన్ సినిమా ట్రెండ్ కు అద్దం పడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X