మిల్కీ బ్యూటీ అంటే తప్పా? తమన్నా భాటియాపై విరుచుకుపడ్డ సీనియర్ నటుడు

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ తమన్నా భాటియా‌ను అందరూ ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకోవడం, మీడియాలో రాయడం కొత్త విషయమేమీ కాదు. అందుకు కారణం ఆమె బాడీ కలర్ మిల్కీగా, శ్వేత వర్ణంలో ఉండటమే. అయితే ఆమెను మిల్కీ బ్యూటీ అని నటుడు అన్నూ కపూర్ సంబంధించడం వివాదంగా మారింది. ఆయన వ్యాఖ్యలను, ఆమె గురించి చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే వివాదంగా మారిన తన కామెంట్స్ గురించి అన్నూ కపూర్ జూమ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే?

టెలివిజన్ యాంకర్‌గా, నటుడిగా హిందీ వినోద పరిశ్రమలో రాణించిన అన్నూ కపూర్ ఇటీవల యూట్యూబర్ శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఇటీవల మ్యూజిక్ వరల్డ్‌లో సంచలనం రేపిన తమన్నా నర్తించిన ఆజ్ కీ రాత్ పాట గురించి ప్రస్తావన వచ్చింది. ఆ పాట నాకు బాగా నచ్చింది. ఆ సాంగ్ చూసిన తర్వాత తమన్నాకు అభిమానిగా మారిపోయాను. ఓ మై గాడ్.. ఆమె మిల్కీ బాడీ చూస్తే మతిపోయింది అని కామెంట్ చేశాడు.

Tamannaah Bhatia

ఈ సంభాషణ సందర్భంగా.. తన పాటను చూసిన కుర్రకారుకు నిద్ర పట్టడం లేదు అంటూ తమన్నా చేసిన కామెంట్స్ ప్రస్తావించగా.. ఆమె మిల్కీ బాడీ (దూదియా బదన్)తో, ముఖంతో కుర్రకారు సుఖంగా నిద్రపోయేలా చేస్తున్నది. అలాంటి గొప్ప పనిచేయడం నిజంగా అదృష్టమే. దేశంలోని యువత సుఖంగా నిద్రపోయేలా చేయడం గొప్ప వరం. ఆమె ఎలాంటి కోరికలు ఉన్నా.. భగవంతుడు ఆమెకు అన్నీ ప్రసాదించాలి. ఆమె కోసం నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని అన్నూ కపూర్ అన్నారు.

Also Read
Chennai Love Story First Review: చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ రివ్యూ
Chennai Love Story First Review: చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ రివ్యూ

అయితే అన్నూ కపూర్ చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయి. నీకు కూతుళ్లు, మనవరాళ్లు ఉన్నారు. మీరు గౌరవ ప్రదంగా మాట్లాడాలి. నీ కూతురును కూడా ఇలానే అంటావా? అని నెటిజన్లు గరంగా కామెంట్స్ చేశారు. అయితే తనపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ గురించి అన్నూ కపూర్ ఇటీవల జూమ్ ఇంటర్వ్యూలో మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Bollywood Actor Annu Kapoor

భారతీయులు 300 సంవత్సరాలు అంగ్లేయుల పాలనలో బతికారు. ఇంగ్లీష్‌లో అమ్మను తిడితే అందరికీ వినసోంపుగా ఉంటుంది. దాని వల్ల ఏ సమస్య ఉండదు. అదే తిట్టును హిందీలో తిడితే అందరూ వల్గర్, తప్పు అని ఘోష పెడుతుంటారు. మన మైండ్ నుంచి ఇంకా ఆంగ్లేయుల ప్రభావం పోలేదు. 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చినప్పటికీ.. కేవలం పొలిటికల్‌గా ఫ్రీడమ్ వచ్చిందే కానీ.. మానసికంగా ఇంకా స్వేచ్ఛ లభించలేదు. ఇంకా భారతీయులందరూ బానిస బతుకునే బతుకుతున్నారు అని ఆయన అన్నారు.

Recommended For You
Jana Nayagan First Review: జన నాయగన్ మూవీ ఫస్ట్ రివ్యూ
Jana Nayagan First Review: జన నాయగన్ మూవీ ఫస్ట్ రివ్యూ

తమన్నాను మిల్కీ బాడీ అంటే తప్పేమీ లేదు. కానీ హిందీలో దూదియా బదన్ అంటే తప్పు. హిందీలో నా మాటలు బాధిస్తే.. అందుకు క్షమాపణ చెబుతున్నాను. ఆమె సుఖంగా, సంతోషంగా సౌభాగ్యవతిగా జీవించాలని పెద్ద వాడిగా ఆమెకు దీవెనలు అందిస్తున్నాను అని అన్నూ కపూర్ తెలిపారు.

Read more about: annu kapoor tamannaah bhatia
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X