Chennai Love Story First Review: చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ రివ్యూ
యువ హీరో, హీరోయిన్లు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ నటించిన ఎమోషనల్ లవ్ స్టోరి చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ మూవీని ఎస్కేఎన్,సాయి రాజేశ్ నిర్మించారు. ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు మ్యూజిక్: మణిశర్మ, ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్, ఎడిటర్: సాయి నాయుడు, లిరిక్స్: అనంత శ్రీరామ్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అధికారులు, ప్రతినిధులు, సభ్యులు వీక్షించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? ఈ మూవీకి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

చెన్నై లవ్ స్టోరి సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్‌కు చెందిన స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) సినిమా పరిశ్రమలో రాణించాలనే కోరికతో చెన్నైలో అడుగుపెడుతాడు. చెన్నైలో సినిమా అవకాశాలు ప్రయత్నిస్తున్న సమయంలో అప్పటికే బ్రేకప్ అయిన అమ్మాయి (శ్రీ గౌరీ ప్రియ)ను చూస్తాడు. మద్యం మత్తులో ఉండే ఆమెతో పరిచయం కోసం ప్రయత్నిస్తాడు. అయితే ఆ అమ్మాయి స్టీవెన్‌ను దూరంగా పెడుతుంది. కానీ తన ప్రయత్నాలు ఆపకుండా ఆమెకు దగ్గరవుతాడు. అయితే ఆమె గతంలో ఏం జరిగింది? ఆవిడతో స్టీవెన్ ప్రయాణం ఎలా సాగింది? ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ కథ.
ఈ సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు, ప్రతినిధుల బృందం రివ్యూ చేసింది. ఈ సినిమాలో కంటెంట్‌ను తెరకెక్కించిన విధానం.. ప్రతీ సన్నివేశంలోని పండించిన భావోద్వేగాలు ఆకట్టుకొన్నాయనే విషయాన్ని వెల్లడించారు. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఈ సినిమాకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రిలీజ్‌కు సెన్సార్ సర్టిఫికెట్ జారీ అయింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఈ సినిమాలోని లవ్, ఎమోషనల్ సీన్లు, ఫ్యామిలీ డ్రామా ఉండటం వల్ల యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం ఈ మూవీని 16 ఏళ్ల దాటిన ప్రతీ ఒక్కరు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు.
ఈ చిత్రంలోని కథ, కథనాలు డిమాండ్ చేయడం, హీరో, హీరోయిన్ల మధ్య లవ్ జర్నీ చాలా ఎమోషనల్‌గా సాగడం వల్ల నిడివి విషయంలో చిత్ర యూనిట్ కాంప్రమైజ్ కాలేదు. దాంతో ఈ సినిమా నిడివి 179 నిమిషాలు అంటే 2 గంటల 59 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. అంటే దాదాపు ఈ చిత్రం నిడివి మూడు గంటలు ఉంటుందని సెన్సార్ సర్టిఫికెట్ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల కాలంలో రన్ టైమ్ పెద్దగా ఉన్న చిత్రాల్లో ఈ మూవీ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో ప్రధానంగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ మధ్యనే కథ, సన్నివేశాలు సాగుతాయి. ఫ్రెండ్ క్యారెక్టర్‌లో సిరి హన్మంతు కీలక పాత్రను పోషించారు. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ హైలెట్‌గా ఉంటుంది. ఈ సినిమాకు క్లైమాక్స్ ఇంపార్టెంట్‌గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాలను హత్తుకొనేలా ఉంటాయి అని రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications


