Chennai Love Story Day 2 Collections: దుమ్మురేపుతోన్న కిరణ్.. చెన్నై లవ్ స్టోరీకి రెండో రోజు వసూళ్లు ఎంతంటే?
వరుస విజయాలతో జోరు మీదున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం... అచ్చ తెలుగు అమ్మాయి శ్రీగౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన మూవీ చెన్నై లవ్‌స్టోరీ. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌లు ఈ సినిమాను నిర్మించగా.. రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేశ్ ఈ సినిమాకు కథను కూడా అందించడం విశేషం. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ మూవీకి సంగీతం అందించారు. సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. వరల్డ్ వైడ్‌గా జూలై 24న చెన్నై లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎంత వసూలు చేసిందంటే?
చెన్నై లవ్ స్టోరీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి చెన్నై లవ్ స్టోరీ మూవీని 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్, ట్రైలర్లు, పాటలు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కిరణ్ అబ్బవరం మూవీకి మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ టాక్. చెన్నై లవ్ స్టోరీ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 15 కోట్ల రూపాయల షేర్.. 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలని బ్రేక్ఈవెన్ టార్గెట్ నిర్దేశించారు.

చెన్నై లవ్ స్టోరీ తొలిరోజు కలెక్షన్స్
చెన్నై లవ్ స్టోరీ మూవీకి వరల్డ్ వైడ్‌గా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 3.13 కోట్ల రూపాయల గ్రాస్ వసూలవ్వగా.. తొలిరోజున ఇండియా వైడ్‌గా 4.95 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఈ మూవీకి తొలిరోజున ఇండియా వైడ్‌గా 1879 షోలు ప్రదర్శితమై 281.4K టికెట్లు సేల్ అయ్యాయి. ఫస్ట్ డే ఆంధ్రప్రదేశ్‌లో 1.90 కోట్ల రూపాయలు, తెలంగాణలో 1.87 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 40.99 లక్షల రూపాయలు, మహారాష్ట్రలో 1.55 లక్షల రూపాయలు, తమిళనాడులో 93 వేల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 4.35 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
చెన్నై లవ్ స్టోరీ ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక అమెరికాలో 293 సెంటర్స్‌లో 453 ప్రీమియర్స్ ఏర్పాటు చేయగా 3687 టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా కిరణ్ అబ్బవరం మూవీకి 53801 డాలర్లు (52 లక్షల రూపాయలు) రాబట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూరప్ తదితర దేశాలలో కలిపి చెన్నై లవ్‌స్టోరీ మూవీ తొలిరోజున ఓవర్సీస్‌లో 275K డాలర్లు (2.65 కోట్ల రూపాయలు) రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 13.2 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఇది రికార్డ్ ఓపెనింగ్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
చెన్నై లవ్ స్టోరీ రెండో రోజు వసూళ్ల అంచనా
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో చెన్నై లవ్ స్టోరీ మూవీకి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. వీకెండ్ కూడా కలిసి రావడం, పోటీ వస్తుందనుకున్న జన నాయగన్‌కు మిక్స్‌డ్ టాక్ కారణంగా శనివారం కిరణ్ అబ్బవరం మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. రెండో రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ సినిమాకు ఇండియాలో 912 షోలు ప్రదర్శితమై 43 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది.
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం చెన్నై లవ్ స్టోరీ మూవీకి ఇండియాలో రెండో రోజున 2.82 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కిరణ్ అబ్బవరం మూవీ శనివారం తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 7 నుంచి 10 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీ జోరు చూస్తుంటే వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసేలా కనిపిస్తోంది. మరి కిరణ్ అబ్బవరం ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications


