పోయి డాక్టర్‌కి చూపించుకో... నెటిజన్‌కి తనూజ దిమ్మతిరిగేలా కౌంటర్..

బిగ్‌బాస్ తెలుగు 9లో లేడీ సింగంగా అందరి మన్ననలు పొందారు కన్నడ నటి తనూజ పుట్టస్వామి. తెలుగు అమ్మాయి కాకపోయినా తన వ్యక్తిత్వం, దూకుడుతో ఆకట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ సీజన్‌కు ఆమె విజేతగా నిలుస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా రేసులోకి దూసుకొచ్చిన కళ్యాణ్ పడాల కప్పును తన్నుకుపోయాడు. బిగ్‌బాస్ జరుగుతున్న సమయంలోనూ, ముగిశాక కూడా తనూజపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఇలాంటివి మానుకోవాలని.. పలుమార్లు తనూజ పద్ధతిగా చెప్పి చూసింది. అయినప్పటికీ కొందరు నెటిజన్లు మాత్రం ఆమెను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇక సహనం నటించడంతో తాజా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాత్రం కాస్తంత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు తనూజ. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
టాలీవుడ్‌పై మళ్లీ నోరు పారేసుకున్న తమన్నా.. హీరోయిన్ల పరిస్థితి దారుణంగా అంటూ..
టాలీవుడ్‌పై మళ్లీ నోరు పారేసుకున్న తమన్నా.. హీరోయిన్ల పరిస్థితి దారుణంగా అంటూ..

దీనిని బట్టి నాకు తెలిసింది ఏంటంటే మీకు పని పాటా లేదు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెబుతున్నారు. మీలాంటి వాళ్లు ఎక్కడి నుంచి వస్తారో తెలియడం లేదు.. సాంగ్ వస్తుంటే కుట్రలు ఎందుకుంటాయి. మైండ్ సరిగా లేకపోతే డాక్టర్ దగ్గర చూపించుకుని మాట్లాడటం నేర్చుకోండి.. తెలుగును బాగా ఎందుకు నేర్చుకోలేదో అప్పుడప్పుడు బాధపడుతుంటాను, ఇలాంటివి చూస్తుంటే మంచికే అనిపిస్తుంది. ప్రతిసారి ఎంఎం, పీఎం, పీఎస్ అంటారు... మీరంతా పనిపాటా లేకుండా కూర్చొన్నారా అని తనూజ మండిపడ్డారు.

Bigg Boss fame Thanuja Puttaswamy Warns Trollers in Emotional Instagram Live

కళ్యాణ్ ఒక సమస్యలో ఉన్నప్పుడు తనూజ ఒక కాల్ చేసి అప్పటికప్పుడు సాయం చేసిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను కాల్ చేసింది ఎవరికో కాదు..పీఎస్‌కి. అతను అర్ధరాత్రి 1.30 వరకు కళ్యాణ్‌తో ఉండి తర్వాత బయల్దేరాడు. కళ్యాణ్ ప్రతిసారి కుక్ షోలో తక్కువ మార్కులు తెచ్చుకుంటుంటే ఇదే ఎంఎం అండగా నిలబడ్డాడు. తనూజ బిగ్‌బాస్‌కి వచ్చినప్పుడు సునంద గురించి, హరితమ్మ గురించి మాట్లాడింది.. పీఎస్ టాపిక్ మాత్రం తీయలేదు. బిగ్‌బాస్ నుంచి బయటికి రాగానే నా మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని తెలిసి అదే ఎంఎం.. బయట జరిగేది వేరు, బిగ్‌బాస్‌లో జరిగేది వేరని చెప్పారు. బిగ్‌బాస్‌లో జరిగింది వదిలేసి ఇప్పుడు హ్యాపీగా ఉండండి.. నెగిటివ్ పబ్లిసిటీ గురించి పట్టించుకోవద్దని అదే ఎంఎం నాకు సపోర్ట్ చేస్తున్నారు.

Recommended For You
ఆ సినిమా నుంచి అల్లు అర్జున్‌ అవుట్.. బన్నీని అవమానించిన టాప్ డైరెక్టర్
ఆ సినిమా నుంచి అల్లు అర్జున్‌ అవుట్.. బన్నీని అవమానించిన టాప్ డైరెక్టర్

ఓ పెద్దాయన కూడా నీ అంతు చూస్తా.. ముద్ద మందారం నుంచి ఎవరొస్తారో చూస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. ఆయన ఈ వయసులో ఇలాంటివి వదిలేసి ఏదైనా ఆశ్రమంలోకి వెళ్లి ధ్యానం చేసుకోవచ్చు కదా. ఒక వ్యక్తి గురించి తెలియనప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు.. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి. నా మీద జరిగే ట్రోలింగ్‌ గురించి నా ఫ్యాన్స్ నా దృష్టికి తీసుకొస్తున్నారు. చాలా వరకు ఇలాంటివి వద్దు అని చెబుతున్నా.. ఇప్పటి వరకు పోస్టులు పెట్టా, కానీ ఈసారి లైవ్‌లోకి వచ్చి బతిమలాడుతున్నా. ఇప్పటికీ నేను, కళ్యాణ్ మంచి మిత్రులం.. ఏదైనా సమస్య ఉంటే కలిసి పరిష్కరించుకుంటాం. మా ఇళ్లలో కూడా బిగ్‌బాస్ హౌస్‌లో మాదిరిగా కెమెరాలు పెట్టాలా అని తనూజ మండిపడ్డారు.

You May Also Like
షూటింగ్‌లో విషాదం.. ఆ న్యూస్‌తో హృదయం ముక్కలు.. తనూజ కంటతడి
షూటింగ్‌లో విషాదం.. ఆ న్యూస్‌తో హృదయం ముక్కలు.. తనూజ కంటతడి

ఇలాంటివి పట్టించుకోవద్దని మా వాళ్లు చెబుతున్నారు, పట్టించుకోకపోతే కొత్త కొత్త స్టోరీలతో రోజూ వస్తారేమో. ఎవరి గురించి నెగిటివ్‌గా స్ప్రెడ్ చేయొదని నా ఫ్యాన్స్‌కి కూడా చెబుతున్నా. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.. ఉన్న నాలుగు రోజులు కూడా తిట్టుకుంటూ, కొట్టుకుందామా. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను ప్రశాంతంగా చేసుకుంటా. ఒక పోటీని పోటీలా చూసి.. దానిని అక్కడితో వదిలేయండి. మీ వల్ల రోజూ మానసికంగా ఇబ్బందిపడుతున్నానని తనూజ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తనూజకు అండగా నిలుస్తున్నారు.

Read more about: bigg boss Tanuja Puttaswamy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X