Chennai Love Story Day 5 Box Office: చెన్నై లవ్ స్టోరీ బాక్సాఫీస్ హంగామా.. కిరణ్ అబ్బవరం మూవీకి ఎన్ని కోట్లంటే

యువ హీరో కిరణ్ అబ్బవరం, యువ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ సినిమా గత నాలుగు రోజులుగా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా, నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం మీడియం రేంజ్ సినిమాల్లో సంచలనం క్రియేట్ చేస్తున్నది. సహ నిర్మాతగా ధీరజ్ మొగిలినేని వ్యవహరించగా, రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు చేరువైంది.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: మణిశర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రవి నంబూరి, కథ: సాయి రాజేశ్, సినిమాటోగ్రఫి: విశ్వాస్ డేనియల్, ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్, లిరిక్స్: అనంత శ్రీరాం తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Chennai Love Story Day 5 Box Office

లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 15 కోట్ల రూపాయలతో నిర్మించారు. తెలుగు రాష్ట్రాల, ఇతర ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర వాల్యూ కట్టడం జరిగింది. ఓవర్సీస్ రైట్స్‌ను 5 కోట్లుగా వాల్యూ కట్టారు. ఈ సినిమా 15 కోట్ల రూపాయల షేర్, 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేట్రికల్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
Jana Nayagan 6 days Box Office: దారుణంగా క్షీణించిన జన నాయగన్ కలెక్షన్లు.. విజయ్ మూవీ నష్టాల నుంచి బయట పడాలంటే
Jana Nayagan 6 days Box Office: దారుణంగా క్షీణించిన జన నాయగన్ కలెక్షన్లు.. విజయ్ మూవీ నష్టాల నుంచి బయట పడాలంటే

కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ ఆదరణ లభిస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు సుమారుగా 500K డాలర్లు అంటే సుమారుగా 5 కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇంకా యూకే, ఐర్లాండ్, ఇతర దేశాల్లో కలిపి ఈ చిత్రం సుమారుగా 250K డాలర్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఓవర్సీస్‌లో 750K అంటే.. 7.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ఓవర్సీస్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసిన ప్రత్యాంగీరా సినిమాస్ వెల్లడించింది.

Recommended For You
పూజా హెగ్డే అవుట్.. నాని కోసం 'స్పెషల్’‌గా కీర్తీ సురేష్!
పూజా హెగ్డే అవుట్.. నాని కోసం 'స్పెషల్’‌గా కీర్తీ సురేష్!

ఇక ఈ చిత్రం గత 4 రోజుల్లో తెలుగు, కన్నడ, ఇతర రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 3.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తొలి రోజు 5 కోట్ల రూపాయలు, రెండో రోజు 6 కోట్ల రూపాయలు, మూడో రోజు 7 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం 24 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది.

You May Also Like
Newton's 3rd Law First Review: న్యూటన్ థర్డ్ లా మూవీ ఫస్ట్ రివ్యూ
Newton's 3rd Law First Review: న్యూటన్ థర్డ్ లా మూవీ ఫస్ట్ రివ్యూ

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల్లో భారీగా వసూళ్లను నమోదు చేసింది. ఆంధ్రా, తెలంగాణలో కలిపి 20.5 కోట్ల రూపాయలు నెట్ కలెక్ట్ చేసింది. నైజాంలో 6 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 6 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. , కన్నడలో 2.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో ఈ సినిమాను దాదాపు 5 రాష్ట్రాల్లో సుమారుగా 500 లోకేషన్లలో 1300 లకుపైగా షోలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఐదో రోజు 1.25 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. కడపటి సమాచారం అంటే మధ్యాహ్నం షోల వరకు నమోదైన ఆక్యుపెన్సీ ప్రకారం.. ఈ సినిమా 1.5 కోట్ల గ్రాస్, 1.25 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. సాయంత్రం, నైట్ షోలకు ఇంకా భారీగా స్పందన ఉంటే.. ఈ చిత్రం 3.5 నుంచి 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నిర్మాతలు, చిత్ర యూనిట్ వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం.. ఈ సినిమా 3 రోజుల్లో 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 4వ రోజు 4 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 44 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా ఇంకో 3.5 కోట్లను ఐదో రోజు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 47 నుంచి 48 కోట్ల మధ్య వసూళ్లను నమోదు చేస్తుంది. ఇప్పటీకే రిలీజైన ప్రతీ చోట బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూలర్లు భారీ లాభాలను సాధించి పెట్టడానికి అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X