Jana Nayagan 6 days Box Office: దారుణంగా క్షీణించిన జన నాయగన్ కలెక్షన్లు.. విజయ్ మూవీ నష్టాల నుంచి బయట పడాలంటే

తమిళనాడు సీఎం, దళపతి విజయ్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాను కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.

ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రను పోషించగా, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి ప్రధాన పాత్రల్లో తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Jana Nayagan Day 6 Expected Box Office

తమిళనాడులో
తమిళనాడులో జన నాయగన్ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం త్వరలోనే 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా 93 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 50 కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
Chennai Love Story Day 5 Box Office: చెన్నై లవ్ స్టోరీ బాక్సాఫీస్ హంగామా.. కిరణ్ అబ్బవరం మూవీకి ఎన్ని కోట్లంటే
Chennai Love Story Day 5 Box Office: చెన్నై లవ్ స్టోరీ బాక్సాఫీస్ హంగామా.. కిరణ్ అబ్బవరం మూవీకి ఎన్ని కోట్లంటే

కర్ణాటకలో
తమిళనాడు తర్వాత ఇండియాలో ఈ సినిమా కర్ణాటకలోనే రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 75 శాతానికిపైగా రికవరీ సాధించింది అని తెలిపారు.

Recommended For You
Spider Man Day 1 Box Office: రిలీజ్‌కు ముందే స్పైడర్ మ్యాన్ కలెక్షన్ల సంచలనం.. ప్రపంచవ్యాప్తంగా రికార్డుల హోరు
Spider Man Day 1 Box Office: రిలీజ్‌కు ముందే స్పైడర్ మ్యాన్ కలెక్షన్ల సంచలనం.. ప్రపంచవ్యాప్తంగా రికార్డుల హోరు

ఉత్తరాది రాష్ట్రాల్లో
విజయ్ నటించిన ఈ సినిమా నార్త్ ఇండియాలో ముఖ్యంగా జన నేత పేరుతో విడుదలైన హిందీ వెర్షన్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం ఉత్తరాది ఏరియాలో 15 కోట్ల రూపాయల గ్రాస్, 12 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇదే ఊపును కొనసాగిస్తే.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది.

You May Also Like
పూజా హెగ్డే అవుట్.. నాని కోసం 'స్పెషల్’‌గా కీర్తీ సురేష్!
పూజా హెగ్డే అవుట్.. నాని కోసం 'స్పెషల్’‌గా కీర్తీ సురేష్!

కేరళలో బాక్సాఫీస్ వద్ద
కేరళలో విజయ్ క్రేజ్‌కు తగినట్టుగా జన నాయగన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ఈ చిత్రం గత 5 రోజుల్లో 14 కోట్ల రూపాయల గ్రాస్, 6.5 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 8 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం రికవరీ సాధించింది. త్వరలోనే ఈ చిత్రం మలయాళంలో లాభాల బాట పట్టాల్సి ఉంటుంది.

Newton's 3rd Law First Review: న్యూటన్ థర్డ్ లా మూవీ ఫస్ట్ రివ్యూ
Newton's 3rd Law First Review: న్యూటన్ థర్డ్ లా మూవీ ఫస్ట్ రివ్యూ

తెలుగు రాష్ట్రాల్లో
జన నాయగన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా భగవంత్ కేసరి సినిమాకు ఫ్రీ మేక్ కావడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపలేకపోతున్నారనే అభిప్రాయం కలుగుతున్నది. ఈ చిత్రం గత 5 రోజుల్లో 11.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రాలో 5.25 కోట్లు, నైజాంలో 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వాల్యూ 11 కోట్ల రూపాయలు కాగా, ఇప్పటి వరకు ఈ సినిమా 5.5 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వసూలు చేసింది. అంటే ఈ సినిమా నష్టాల నుంచి బయటపడాలంటే ఇంకా 11 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్‌లో ఎంతంటే?
ఓవర్సీస్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు మధ్యస్తంగా స్పందన కనిపిస్తున్నది. నార్త్ అమెరికాలో పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. కానీ మలేషియా, సింగపూర్‌లో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. అయితే తొలి వారాంతం తర్వాత ఈ సినిమా కలెక్షన్లు భారీగా క్షీణించాయి. ఇప్పటి వరకు ఈ సినిమా 8 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు 73 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

ఇక 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడు మినహాయిస్తే.. ఇతర ప్రాంతాల్లో ఈ మూవీ కలెక్షన్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం.. 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈవెనింగ్, నైట్ షోల తర్వాత ఈ చిత్రం సుమారుగా 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో 3 కోట్ల రూపాయలు, కర్ణాటకల 60 లక్షల రూపాయలు, కేరళలో 30 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. థియేట్రికల్ వాల్యూ ప్రకారం అంటే ( 220 కోట్ల రూపాయల షేర్.. 420 కోట్ల గ్రాస్).. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద ఇంకా భారీగా కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X