I Nobody Box Office: షాకింగ్‌గా ఐ నోబడి బాక్సాఫీస్ కలెక్షన్లు.. పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ హిట్టా? ఫట్టా?
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఐ నోబడీ (I, Nobody). ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, హకీం షాజహాన్, అశోకన్, విజయ్ రాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్, నక్షత్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నిషమ్ బషీర్ దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, E4 ఎక్స్‌పెరిమెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను సుప్రియా మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సారథి నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: దినేష్ పురుషోత్తమన్, ఎఢిటర్: రమీజ్ ఎంబీ, మ్యూజిక్: జేక్స్ బిజోయ్, కథ: సమీర్ అబ్దుల్, క్యాస్టూమ్: ధన్య బాలకృష్ణన్, ఆర్ట్: అర్షద్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా గత 6 రోజులుగా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో క్రైమ్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఆర్టిస్టులు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమామను 40 కోట్ల రూపాయలతో నిర్మించారు.బడ్జెట్‌లో దాదాపు 50 శాతం సొమ్ము నాన్ థియేట్రికల్ అంటే.. ఓటీటీ, శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా రికవరీ సాధించింది. ఈ చిత్రం దాదాపు 20 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
ఐ నోబడి సినిమా ఆరంభంలో మెరుగైన కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజు 2.2 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.25 కోట్ల రూపాయలు, మూడో రోజు 1.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 1.5 కోట్ల రూపాయలు, ఐదో రోజు 55 లక్షల రూపాయలు, ఆరో రోజు 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. గత 6 రోజుల్లో 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే తొలి మూడు రోజుల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను రాబట్టలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమా గత 6 రోజుల్లో కేరళలో 6.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 75 లక్షల రూపాయలు, తమిళనాడులో 40 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 20 లక్షలు వసూలు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయల గ్రాస్. 6 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 14 కోట్ల రూపాయలు ఇంకా రాబట్టాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ మేరకు వసూళ్లు సాధిస్తే హిట్ టాక్‌తో ముగుస్తుంది. లేకపోతే ఈ సినిమా భారీ నష్టాలతో ముగిసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications


