Lenin 16 Days Box Office: లెనిన్ 100 కోట్ల సంచలనానికి సిద్దం .. 3వ వారంలోను అఖిల్ వసూళ్ల హవా

అక్కినేని నట వారసుడు అఖిల్ నటించిన లెనిన్ చిత్రం మూడో వారంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. అందాల తార భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని అందించింది. యువ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా గత రెండు వారాల్లో బాక్సాఫీస్‌ను భారీ‌గా షేక్ చేయడమే కాకుండా కలెక్షన్ల వరద పారించింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ నాగవంశీ, మన్మథుడు నాగార్జున అక్కినేని సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత రెండు వారాల్లో ఏ మేరకు వసూళ్లను సాధించింది? ఈ చిత్రం వంద కోట్లకు ఎంత దూరంలో ఉంది? అనే వివరాల్లోకి వెళితే..

ఈ చిత్రాన్ని సుమారుగా 55 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. అఖిల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా బిజినెస్ 22 కోట్ల మేర జరిగింది. ఈ చిత్రం 44 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా డిస్టిబ్యూటర్లకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో ఈ సినిమా తెలుగు పరిశ్రమను సక్సెస్‌తో కళకళలాడించింది.

Lenin 16 days Box Office Collections

ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలివారం 37 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. రెండో వారంలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో వారంలో 15వ రోజు 1 కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 48 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
Spider Man: Brand New Day First Review: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఫస్ట్ రివ్యూ
Spider Man: Brand New Day First Review: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఫస్ట్ రివ్యూ

లెనిన్ చిత్రం రాష్ట్రాల వారీగా సాధించిన కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 48 కోట్ల రూపాయల నెట్, కర్ణాటకలో 5.5 కోట్ల నెట్, తమిళనాడులో 1 కోటి రూపాయల నెట్, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం ఇండియాలో 54 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 11 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 65 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Recommended For You
'నా శరీరం మరో మగాడిని కోరుకొన్నది.. అందుకే నాలుగో ప్రియుడిని వదిలేశాను’
'నా శరీరం మరో మగాడిని కోరుకొన్నది.. అందుకే నాలుగో ప్రియుడిని వదిలేశాను’

అయితే ఈ సినిమా వసూళ్లను సితార ఎంటర్‌టైన్‌మెంట్, అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా రికార్డు రూపంలో వెల్లడించింది. ఈ చిత్రం 10 రోజుల్లో 88 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని తెలిపింది. ఆ తర్వాత గత 5 రోజుల్లో ఈ చిత్రం సుమారుగా 9 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 97 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.

You May Also Like
Jana Nayagan Movie Review: జన నాయగన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Jana Nayagan Movie Review: జన నాయగన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

లెనిన్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది

Read more about: lenin akhil box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X