Spider Man: Brand New Day First Review: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఫస్ట్ రివ్యూ

అమెరికన్ సూపర్ హీరో ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న మరో స్పైడర్ మ్యాన్ చిత్రం స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man: Brand New Day). స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో ఇది నాలుగోది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. స్టాన్ లీ, స్టీవ్ డిటికో రచించిన స్పైడర్ మ్యాన్ పుస్తకం ఆదారంగా ఈ చిత్రాన్ని కెవిన్ ఫీజ్, ఆమీ పాస్కల్, అవి అరద్ నిర్మించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, జెండ్ా, సాదీ సింక్, జాకబ్ బాటాలాన్, జాన్ బెర్నథాల్ తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: బ్రెట్ పావ్లాక్, ఎఢిటింగ్: నాట్ సాండర్స్, జినా సన్సామ్, మ్యూజిక్: మైఖేల్ జియాచినో తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. మార్వెల్ స్టూడియోస్. పాస్కల్ పిక్చర్స్, సోని భాగస్వామ్యంలో ఈ చిత్రం జూలై 30వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండియాలో సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల ముగిసాయి. ఈ సినిమాకు జారీ చేసిన సర్టిఫికెట్ ఏంటి? ఈ మూవీ రన్ టైమ్ ఎంత? ఈ చిత్రంపై ఉన్న ఫీడ్‌‌బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Spider Man Brand New Day CBFC Review

అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఈ ఫ్రాంచైజీని భారతీయ ప్రేక్షకులకు అందించేందుకు భారీగా ప్లాన్ చేశారు. ఇంగ్లీష్‌లో రూపొందిన ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోకి డబ్బింగ్ చేశారు. ఈ చిత్రాన్ని 2డీ, 3డీ, 4డీఎక్స్, ఎంఎక్స్ 4డీ 3డీ తదితర వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Also Read
Srinivasa Mangapuram First Review: శ్రీనివాస మంగాపురం మూవీ ఫస్ట్ రివ్యూ
Srinivasa Mangapuram First Review: శ్రీనివాస మంగాపురం మూవీ ఫస్ట్ రివ్యూ

డాక్టర్ స్ట్రేంజ్ సహాయంతో పీటర్ పార్కర్ తనకు ఇష్టమైన జీవితాన్ని, ఆ లైఫ్ చుట్టూ ఉన్న మెమొరీస్‌ను పూర్తిగా తుడిపేసుకొంటాడు. న్యూయార్క్‌లో నేరాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సమయంలో తనకు శత్రువులుగా మారిన వారు పీటర్‌పై కన్నేస్తారు. తన మెమొరీస్ తుడిచిపెట్టుకుపోయినా.. తన ఆకారం గుర్తించేలా ఉండటంతో శత్రువులు దాడికి సిద్దమవుతారు. ఇక న్యూయార్క్‌లో కొత్త రకమైన నేరాలకు శత్రువులు తెర లేపుతారు. ఆ నేరాలను పీటర్ ఎదుర్కొన్నాడా? తనపై దాడికి పాల్పడిన వారికి ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఈ సినిమా కథ.

Recommended For You
Jana Nayagan Movie Review: జన నాయగన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Jana Nayagan Movie Review: జన నాయగన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న యాక్షన్, అడ్వెంచర, సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాను ఇండియన్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అధికారులు, ప్రతినిధులు, వీక్షించారు. ఈ సినిమాలోని టెక్నికల్ అంశాలు, స్పైడర్ మ్యాన్ విన్యాసాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇండియన్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు, డైలాగ్స్‌కు స్వల్ప మార్పులను సూచించగా.. అందుకు చిత్ర యూనిట్ సానుకూలంగా స్పందించడంతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

You May Also Like
Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఈ సినిమాపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డు ప్రశంసలు గుప్పించడమే కాకుండా ఈ చిత్రానికి యూఏ (UA13+) సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే ఈ సినిమాను 13 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడొచ్చని సెన్సార్ అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు. నోదాత్మకంగా, యాక్షన్, అడ్వెంచర్ సన్నివేశాలు డిమాండ్ చేయడం వల్ల సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే నిడివి పెరిగింది. ఈ చిత్రం నిడివి సుమారుగా 2 గంటల 25 నిమిషాలు. అంటే ఈ సినిమా రన్ టైమ్ 145 నిమిషాలుగా అని సెన్సార్ సర్టిఫికెట్ స్పష్టం చేసింది.

నేను ఇండియన్‌ను కాదు.. పాస్‌పోర్ట్ వెనక్కి ఇచ్చేస్తా.. అఖిల్ అక్కినేని షాకింగ్ నిర్ణయం
నేను ఇండియన్‌ను కాదు.. పాస్‌పోర్ట్ వెనక్కి ఇచ్చేస్తా.. అఖిల్ అక్కినేని షాకింగ్ నిర్ణయం

ఇక ఈ సినిమాలోని పీటర్ పార్కర్‌గా టామ్ హాలెండ్ నటన, ఎంజేగా జెండ్యా యాక్టింగ్, జాకోబ్ బాటలన్, సాడీ సింగ్ యాక్టింగ్ హైలెట్‌గా ఉంటాయి. సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ కట్టిపడేసేలా ఉంటాయి. కామెడీ పార్ట్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అనే టాక్ సెన్సార్ తర్వాత బయటకు వచ్చింది. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిలింబీట్‌ను ఫాలో అవ్వండి.

Read more about: tom holland hollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X