Lenin Box Office Collections: లెనిన్ బాక్సాఫీస్ ఊచకోత.. 3 రోజుల్లో 50 కోట్లకు చేరువగా అఖిల్ మూవీ

యువ హీరో, హీరోయిన్లు అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లవ్, ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం చేసిన బిజినెస్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా గత మూడు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Lenin 3 Days Box Office Collections

ఇంటెన్స్ లవ్ స్టోరీ, రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన లెనిన్ చిత్రం ఖర్చుకు వెనుకాడకుండా రూపొందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన టెక్నిషియన్స్, నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 55 కోట్ల రూపాయలతో నిర్మించారు.ఈ చిత్రం నాన్ థియేట్రికల్ ద్వారా 30 కోట్ల రూపాయలు వసూలు చేసి సుమారుగా 50 శాతం రికవరీని సాధించింది. ఇక 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడంతోపాటు.. 22 కోట్ల షేర్, 44 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Also Read
Jana Nayagan Censor Report: జన నాయగన్ సెన్సార్ రిపోర్ట్.. విజయ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పడంటే?
Jana Nayagan Censor Report: జన నాయగన్ సెన్సార్ రిపోర్ట్.. విజయ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పడంటే?

అఖిల్ అక్కినేని నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం తొలి రోజు 16.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక రెండో రోజు 21 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో రెండు రోజుల్లోనే ఈ చిత్రం 37.2 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది అని నిర్మాతలు వెల్లడించారు.

Recommended For You
The Odyssey Censor Report: ది ఒడిస్సీ మూవీ ఇండియన్ సెన్సార్ రిపోర్ట్
The Odyssey Censor Report: ది ఒడిస్సీ మూవీ ఇండియన్ సెన్సార్ రిపోర్ట్

భాగ్యశ్రీ భోర్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ వివిధ రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, తెలంగాణలో గత రెండు రోజుల్లో 16 కోట్ల రూపాయల నెట్, తమిళనాడులో 20 లక్షల రూపాయలు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా, ఇతర రాష్ట్రాల్లో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 18 కోట్ల రూపాయల నెట్, 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

You May Also Like
Hrudhayam Murali Box Office: డీసెంట్‌గా హృదయం మురళి కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
Hrudhayam Murali Box Office: డీసెంట్‌గా హృదయం మురళి కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

లెనిన్ చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీగానే కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో సుమారుగా 500K డాలర్లు అంటే.. సుమారుగా 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్, ఇతర దేశాల్లో ఈ సినిమా మరో 5 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 34 కోట్ల మేర వసూళ్లను సాధించింది. అయితే నిర్మాతలు 37 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని వెల్లడించడం తెలిసిందే.

Lenin Day 3 AP, TG Box Office: అఖిల్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు.. ఏపీ, నైజాంలో లెనిన్‌కు ఎన్ని కోట్లంటే?
Lenin Day 3 AP, TG Box Office: అఖిల్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు.. ఏపీ, నైజాంలో లెనిన్‌కు ఎన్ని కోట్లంటే?

ఇక మూడో రోజు కూడా లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. ఈ చిత్రం 3వ రోజు కూడా సుమారుగా 15 నుంచి 20 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లను రాబడుతుంది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more about: lenin akhil box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X