Lenin Day 2 Collections:లెనిన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. అఖిల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?

Lenin Day 2 Collections: అక్కినేని అఖిల్ కెరీర్‌లో వరుస ఫెయిల్యూర్ తరువాత లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తొలిషో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలను మిళితం చేస్తూ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా.. విడుదలైన తర్వాత వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్లలో కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లెనిన్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు లెనిన్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు? రెండో రోజు అంచనా కలెక్షన్లు ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

లెనిన్ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా.. రాంకీ, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. థమన్ అందించిన సంగీతం, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ముఖ్యంగా మాస్ ఎలివేషన్ సన్నివేశాల్లో థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

Recommended For You
Lenin Movie Public Talk: లెనిన్ మూవీ పబ్లిక్ టాక్.. అఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Lenin Movie Public Talk: లెనిన్ మూవీ పబ్లిక్ టాక్.. అఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Lenin Day 2 Expected Box Office Collections Worldwide

జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'లెనిన్'కు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. కథ కొత్తది కాకపోయినా, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్లు, అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రామీణ నేపథ్యంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని సోషల్ మీడియాలోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండగా.. మల్టీప్లెక్స్‌లలో కూడా వీకెండ్ బుకింగ్స్ ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.

You May Also Like
ఎన్టీఆర్‌కు పోటీగా ధనుష్? ఒకే బ్యాక్‌డ్రాప్‌తో రెండు సినిమాలు..
ఎన్టీఆర్‌కు పోటీగా ధనుష్? ఒకే బ్యాక్‌డ్రాప్‌తో రెండు సినిమాలు..

మొదటి రోజు 'లెనిన్' ప్రపంచవ్యాప్తంగా రూ. 9.73 కోట్ల గ్రాస్ వసూలు చేసి అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 6.73 కోట్ల గ్రాస్, రూ.5.90 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకుంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీ విదేశాల్లో రూ. 3 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లలో దాదాపు 69. 17 శాతం ఇండియా నుంచే, ఇక 30. 83 శాతం ఓవర్సీస్ మార్కెట్ నుంచి రావడం విశేషం. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన రావడంతో విదేశీ మార్కెట్‌లో కూడా గుడ్ స్టార్ దొరికింది. అఖిల్ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆయన కెరీర్‌లో తొలి పెద్ద కమర్షియల్ హిట్‌గా 'లెనిన్' నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. యాంకర్ రష్మి ఎమోషనల్
ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. యాంకర్ రష్మి ఎమోషనల్

ఇక రెండో రోజు అంచనా కలెక్షన్ల విషయానికి వస్తే.. శనివారం కావడంతో సినిమా మరింత జోరు కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మధ్యాహ్నం వరకు 'లెనిన్' మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 3. 43 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ జోరును చూస్తే.. ఈ రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రెండో రోజు ఇండియా గ్రాస్ కలెక్షన్లు సుమారు రూ. 7 కోట్ల రూపాయల వరకు చేరే అవకాశం కనిపిస్తోంది.

Fauzi OTT: రిలీజ్‌కు ముందే ప్రభాస్ 'ఫౌజీ'కి జాక్‌పాట్.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Fauzi OTT: రిలీజ్‌కు ముందే ప్రభాస్ 'ఫౌజీ'కి జాక్‌పాట్.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?

శనివారం సాయంత్రం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్లకు రావడం, యువత నుంచి కూడా మంచి స్పందన ఉండటంతో ఈ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్క ప్రకారం రెండు రోజులకే భారత్‌లో రూ. 12 కోట్లకు పైగా గ్రాస్ నమోదు కావచ్చని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఓవర్సీస్ కలెక్షన్లు కూడా కలిపితే రెండు రోజుల ప్రపంచవ్యాప్త గ్రాస్ రూ. 18 నుంచి రూ. 20 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు.. లెనిన్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.16.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించడం గమనార్హం.

NTR Trivikram Movie: చూస్తూ ఊరుకోం.. ప్రారంభానికి ముందే వివాదం..
NTR Trivikram Movie: చూస్తూ ఊరుకోం.. ప్రారంభానికి ముందే వివాదం..

బడ్జెట్, బిజినెస్ పరంగా చూస్తే.. లెనిన్ సినిమా సుమారు రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించారు. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5, శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకున్నాయి. నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతలకు మంచి మొత్తమే తిరిగి వచ్చినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.70 కోట్ల వరకు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అల్లు అర్జున్ ముఖం మీదే అలా అనేశారు.. గుండెనిండా గుడిగంటలు నటి షాకింగ్ కామెంట్స్
అల్లు అర్జున్ ముఖం మీదే అలా అనేశారు.. గుండెనిండా గుడిగంటలు నటి షాకింగ్ కామెంట్స్

అయితే ప్రస్తుతం వస్తున్న పాజిటివ్ టాక్ నిర్మాతల్లో, డిస్ట్రిబ్యూటర్లలో ఆశలు పెంచుతోంది. ముఖ్యంగా శనివారం, ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగితే.. సోమవారం నుంచి కూడా సినిమా మంచి హోల్డ్ సాధించే అవకాశం ఉంది. వీకెండ్ ముగిసే నాటికి 'లెనిన్' ఎంత వసూలు చేస్తుందన్నదే ఈ సినిమా బాక్సాఫీస్ భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X