ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. యాంకర్ రష్మి ఎమోషనల్
తెలుగు బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షోతో స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ,డీ వంటి పాపులర్ టెలివిజన్ షోలను హోస్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు వెండితెరపై కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు రష్మీ తన కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో 'టాప్ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్'షోకు హోస్ట్‌గా ఎంపికైంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ షోపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో షో ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఆహా కర్టెన్ రైజర్ ఈవెంట్లో పాల్గొంది. ఈ సందర్బంగా తన వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆరోగ్యానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన లుక్‌పై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు తొలిసారి స్పందిస్తూ .. తన జీవితంలో ఎదురైన ఆరోగ్య సమస్యలు, ఇతర సవాళ్లు, వాటిని ఎలా అధిగమించిందనే అంశాలపై రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

ఈ మధ్యకాలంలో కాస్త బొద్దుగా, లావుగా కనిపిస్తున్నారంటూ యాంకర్ ప్రశ్నించగా.. రష్మీ ఎంతో ఓపెన్‌గా సమాధానం ఇచ్చింది. "నిజం చెప్పాలంటే నాకు ఇలా కనిపించడం అస్సలు ఇష్టం ఉండదు. కెమెరా ముందు కనిపించే లుక్ వాస్తవానికి భిన్నంగా ఉంటుంది. కెమెరా వల్ల కూడా కొంతమంది ఇంకా లావుగా కనిపిస్తారు. అయితే నేను ఇలా కనిపించడానికి ప్రధాన కారణం కొన్ని ఆరోగ్య సమస్యలు. ఆ సమస్యల ప్రభావం వల్లే నా శరీరంలో మార్పులు వచ్చాయి. అందుకే ఇప్పుడు కాస్త బొద్దుగా కనిపిస్తున్నాను" అని చెప్పింది.
అయితే ఈ పరిస్థితి శాశ్వతం కాదని కూడా రష్మీ స్పష్టం చేసింది. "ప్రస్తుతం ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టాను. ఆ సమస్యల నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తాను. నా ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను" అని తెలిపింది. "గత 20 ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. విజయాలు, అపజయాలు రెండూ ఎదురయ్యాయి. అయినప్పటికీ ప్రతి అనుభవం నాకు కొత్త పాఠం నేర్పింది. అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం అలవాటు అయింది" అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఆహాలో ప్రసారం కానున్న 'టాప్ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్'రియాలిటీ షో గురించి కూడా రష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈసారి తాను సింగిల్ హోస్ట్‌గా షోను ముందుకు నడిపించబోతున్నట్లు వెల్లడించింది. "ఇంతకాలం చాలాసార్లు కో-హోస్ట్‌తో కలిసి చేశాను. కానీ ఈసారి ఒక్కదానిగానే హోస్ట్ చేయడం ఒక కొత్త ఛాలెంజ్‌గా భావించాను. కొత్త విషయాలను ప్రయత్నించాలి కదా. పైగా ఎక్కువ పారితోషికం కూడా వస్తోంది" అంటూ నవ్వుతూ సరదాగా సమాధానం ఇచ్చింది.
షూటింగ్ సమయంలో పడే కష్టాల గురించి కూడా ఆమె వివరించింది. "ఒక రియాలిటీ షో షూటింగ్ అంటే బయటివాళ్లకు కనిపించినంత ఈజీ కాదు. హై హీల్స్ వేసుకుని దాదాపు 12 నుంచి 14 గంటల పాటు నిరంతరం నిలబడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కాళ్లు నొప్పించినా, అలసట వచ్చినా షూటింగ్ ఆపే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకసారి కమిట్ అయితే పూర్తి చేయాల్సిందే. అయితే మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఇలాంటి కష్టాలు పెద్దగా అనిపించవు. ప్రేక్షకుల ప్రేమ, అభిమానం చూస్తే ఆ అలసట అంతా మర్చిపోతాం" అంటూ రష్మీ తన అనుభవాలను పంచుకుంది. ఆరోగ్య సమస్యలపై రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications




