MIB Overseas Box Office Collections: మా ఇంటి బంగారం ఓవర్సీస్ కలెక్షన్ల రికార్డు.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ వసూళ్లు సాధిస్తున్నది. తెలుగు రాష్ట్రాలతోపాటు కన్నడ, ఓవర్సీస్‌లో రికార్డులను మించిన కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంట్ సినిమాల్లో సరికొత్త చరిత్రను లఖించింది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తున్నది. నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేసిన ప్రత్యాంగీరా సినిమాస్ వెల్లడించిన అఫీషియల్ బాక్సాఫీస్ వసూళ్ల వివరాల్లోకి వెళితే..
మా ఇంటి బంగారం సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా సమంత ఇమేజ్‌కు తగినట్టుగా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి దాదాపు 28 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఇక ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ వాల్యూను 7 కోట్లుగా వాల్యూ కట్టారు. ఈ చిత్రం దాదాపు 8 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

సమంత నటించిన ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో బ్రహ్మండమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో భారీ వసూళ్లను రాబట్టింది. ప్రత్యాంగీరా సినిమాస్ ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం నార్త్ అమెరికాలో ఈ మూవీ సుమారుగా 2 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం తొలివారాంతంలోనే బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది.
ఇక అమెరికేతర దేశాల్లో ఈ సినిమాకు ఊహించని వసూళ్లు నమోదు అయ్యాయి. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, గల్ఫ్ దేశాల్లో భారీ వసూళ్లు సాధించాయి. యూకే, ఐర్లాండ్ దేశాల్లో ఈ సినిమా 115k పౌండ్లకు పైగా అంటే.. భారతీయ కరెన్సీలో 1.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో ఈ సినిమా 200K ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే.. 1.5 కోట్ల రూపాయలు, మలేషియాలో 100K RM అంటే సుమారుగా 24 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ప్రత్యాంగీరా ఓవర్సీస్ వెల్లడించింది.
ఇక ఈ మూవీ గల్ఫ్ కంట్రీస్‌లో 1 మిలియన్ డాలర్లు అంటే.. 9.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని వెల్లడించారు. దాంతో ఈ సినిమా నార్త్ అమెరికాతోపాటు ఇతర దేశాల్లో మొత్తంగా 35 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమాకు భారీ లాభాలు నమోదు అయ్యాయి. దాదాపు 17 కోట్లకుపైగా షేర్ వసూలైనట్టు సమాచారం.
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన మా ఇంటి బంగారం సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబైంది. శ్రీముఖి, గౌతమి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు రచనా సహకారంతోపాటు నిర్మాతగా ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్, సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీకి హిమాంక్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం జూన్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications


