Manjummel Boys Collections మంజుమ్మెల్ బాయ్స్ రికార్డు కలెక్షన్లు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
ప్రేమలు, భ్రమయుగం సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రూపంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో మరో చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys) చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేసింది. చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. షాహిర్, శ్రీనాథ్ బాసీ, బాలు వర్గీస్, దీపక్ పరాంబో లాంటి సీనియర్ నటులు నటించిన ఈ సినిమా తొలి రోజు ఆట తర్వాత సినీ విమర్శకుల ప్రశంసలే కాకుండా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
అడ్వెంచర్, డ్రామా, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys Genre) చిత్రాన్ని ఎక్కువగా అవుట్ డోర్ షూటింగ్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

బెడిసి కొట్టిన వ్యూహం.. ఆర్జీవి శపథం విఫలం.. సినిమాలు రిలీజ్ వాయిదా వెనుక కారణం ఇదే..
మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys Break Even) సినిమా ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో బిజినెస్ సుమారుగా 4 కోట్లకుపైగా మలయాళంలో, 2 కోట్ల రూపాయలు ఓవర్సీస్‌లో జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాను మలయాళంలో 400 స్క్రీన్లు, ఇతర నగరాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys Occupancy) సినిమా తొలి ఆట తర్వాత బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఆక్యుపెన్సీ అనూహ్యంగా పెరిగిపోయింది. మార్నింగ్ షోకు 60 శాతం, మ్యాట్నీకి 55 శాతం, ఫస్ట్ షోకు 60 శాతం, సెకండ్ షోకు 75 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడింది.

కేరళలోని ప్రధాన పట్టణాల్లో మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys) మూవీకి భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. కోచిలో 90 శాతం, కోజికోడ్‌లో 90 శాతం, త్రిచూర్‌లో 70 శాతం, కొట్టాయం, అలెపుంజీ, కొల్లాం, హైదరాబాద్‌లో 60 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఢిల్లీ, ముంబైలో 50 శాతం కంటే తక్కువగా ఆక్యుపెన్సీ కనిపించింది.

సినీ ప్రేక్షకులకు శుభవార్త.. 99 రూపాయలకే మూవీ టికెట్!
మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys Collections) చిత్రం సుమారుగా 6 కోట్లకుపైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా మలయాళంలోనే తొలి రోజు 3.5 కోట్ల రూపాయలతో రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో కలెక్షన్ల వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఈ సినిమా కూడా ప్రేమలు మాదిరిగానే 50 కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











