Spider Man Box Office Collections: స్పైడర్ మ్యాన్ బాక్సాఫీస్ సునామీ.. అడ్వాన్స్ బుకింగ్‌తో రికార్డుల సెన్సేషన్

అమెరికన్ సూపర్ హీరో ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న మరో స్పైడర్ మ్యాన్ చిత్రం స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man: Brand New Day). స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో ఇది నాలుగోది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. స్టాన్ లీ, స్టీవ్ డిటికో రచించిన స్పైడర్ మ్యాన్ పుస్తకం ఆదారంగా ఈ చిత్రాన్ని కెవిన్ ఫీజ్, ఆమీ పాస్కల్, అవి అరద్ నిర్మించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, జెండ్ా, సాదీ సింక్, జాకబ్ బాటాలాన్, జాన్ బెర్నథాల్ తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: బ్రెట్ పావ్లాక్, ఎఢిటింగ్: నాట్ సాండర్స్, జినా సన్సామ్, మ్యూజిక్: మైఖేల్ జియాచినో తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. మార్వెల్ స్టూడియోస్. పాస్కల్ పిక్చర్స్, సోని భాగస్వామ్యంలో ఈ చిత్రం జూలై 30వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు ఇండియాలో భారీగా స్పందన కనిపిస్తున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌ రికార్డు వసూళ్లు నమోదు అవుతున్నాయి. కేరళ, కర్ణాటక, నైజాంలో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Spider Man Brand New Day Advance Booking

అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఈ ఫ్రాంచైజీని భారతీయ ప్రేక్షకులకు అందించేందుకు భారీగా ప్లాన్ చేశారు. ఇంగ్లీష్‌లో రూపొందిన ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోకి డబ్బింగ్ చేశారు. ఈ చిత్రాన్ని 2డీ, 3డీ, 4డీఎక్స్, ఎంఎక్స్ 4డీ 3డీ తదితర వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే ఈ సినిమాకు కేరళలో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే 65 వేల టికెట్లను అమ్మడం జరిగింది. దాంతో ఈ చిత్రం ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
Spider Man: Brand New Day First Review: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఫస్ట్ రివ్యూ
Spider Man: Brand New Day First Review: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఫస్ట్ రివ్యూ

ఇక కర్ణాటక రాష్ట్రంలోను స్పైడర్ మ్యాన్ హవా కొనసాగుతున్నది. ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వ్యక్తమవుతున్నది. బెంగళూరులో రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఇంకా ఐదు రోజులు ఉండగానే.. ఈ సినిమా 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకు నైజాంలో కూడా క్రేజ్ భారీగా ఉండటంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

Recommended For You
'నా శరీరం మరో మగాడిని కోరుకొన్నది.. అందుకే నాలుగో ప్రియుడిని వదిలేశాను’
'నా శరీరం మరో మగాడిని కోరుకొన్నది.. అందుకే నాలుగో ప్రియుడిని వదిలేశాను’

ఇక నార్త్ ఇండియాలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ భారీగా కనిపిస్తున్నది. నేషల్ ఛైన్స్ థియేటర్లైన పీవీఆర్, సినిపోలీస్ తదితర స్క్రీన్లలో టికెట్ల అమ్మకాలు ఊపందుకొన్నాయి. పీవీఆర్‌లో ఈ చిత్రం 1.5 లక్షల టికెట్లు అమ్ముడు కాగా, సినీ పోలీస్‌లో 50 వేల టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ సినిమా ఇప్పటికే సుమారుగా 20 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజు 60 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తొలి రోజు 1500 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X