దళపతి విజయ్ టాప్-5 బాక్సాఫీస్ హిట్స్.. జన నాయగన్ ఆ రికార్డులు బద్దలు కొడుతుందా?

తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' జూలై 23న (నేడు)ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టే ముందు ఆయన నటించిన చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానులు మాత్రమే కాదు.. ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ ప్రస్థానంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే విజయ్ కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. రూ.600 కోట్ల మార్క్‌ను కూడా దాటిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు 'జన నాయగన్' ఆ రికార్డులను అధిగమిస్తుందా? అనే ఆసక్తికరంగా మారింది.

Also Read
Jana Nayagan Movie Public Talk: జన నాయగన్ మూవీ పబ్లిక్ టాక్.. సీఎం విజయ్ సినిమా ఎలా ఉందంటే.?
Jana Nayagan Movie Public Talk: జన నాయగన్ మూవీ పబ్లిక్ టాక్.. సీఎం విజయ్ సినిమా ఎలా ఉందంటే.?

'జన నాయగన్' ఒక పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. మమితా బైజు కీలక పాత్రలో కనిపించారు. బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, సునీల్, రేవతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమైనప్పటికీ, రిలీజ్‌కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. తొలి రోజు నుంచే అభిమానుల సందడి థియేటర్ల వద్ద కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దళపతి విజయ్ టాప్-5 బాక్సాఫీస్ హిట్స్ వివరాలు..

Recommended For You
సీఎం విజయ్ కోసం అనిల్ రావిపూడి రంగంలోకి.. జన నాయగన్ స్టోరీ వెనుక అసలు కథ ఇదే..
సీఎం విజయ్ కోసం అనిల్ రావిపూడి రంగంలోకి.. జన నాయగన్ స్టోరీ వెనుక అసలు కథ ఇదే..
Thalapathy Vijay Top 5 Highest Grossing Movies Can Jana Nayagan Break Leo Box Office Record

లియో.. ఇప్పటికీ నంబర్ వన్
విజయ్ కెరీర్‌లో ఇప్పటికీ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'లియో'. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.620 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడులోనే రూ.220 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో దాదాపు రూ.200 కోట్లకు చేరువైంది. విజయ్ స్టార్‌డమ్‌ను ప్రపంచవ్యాప్తంగా మరోసారి నిరూపించిన సినిమా ఇదే. ప్రస్తుతం 'జన నాయగన్' ముందు ఉన్న అతిపెద్ద టార్గెట్ కూడా ఇదే.

You May Also Like
విజయ్ దేవరకొండ ఔట్.. ఆనంద్ దేవరకొండ ఇన్.. నాగవంశీ మాస్టర్ ప్లాన్?
విజయ్ దేవరకొండ ఔట్.. ఆనంద్ దేవరకొండ ఇన్.. నాగవంశీ మాస్టర్ ప్లాన్?

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)'
వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)'. విజయ్ కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచింది. ద్విపాత్రాభినయం చేసిన విజయ్ నటనకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. రూ.460 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడులో రూ.200 కోట్లకు పైగా, ఓవర్సీస్‌లో రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 'లియో' తర్వాత విజయ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది.

అదే మీరు నాకు ఇచ్చే నిజమైన బహుమతి.. చిరంజీవి ఎమోషనల్!
అదే మీరు నాకు ఇచ్చే నిజమైన బహుమతి.. చిరంజీవి ఎమోషనల్!

బిగిల్
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'బిగిల్' (తెలుగులో 'విజిల్') విజయ్ కెరీర్‌లో మైలురాయి మూవీ అనే చెప్పాలి. స్పోర్ట్స్, ఎమోషన్, యాక్షన్ కలిసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయ్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. విజయ్ మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమాల్లో ఒక్కటిగా నిలిచింది.

హీరో జయకృష్ణకు మహేష్ బాబు క్లాస్.. ఇండస్ట్రీ ఎంట్రీకి ముందు అలా..
హీరో జయకృష్ణకు మహేష్ బాబు క్లాస్.. ఇండస్ట్రీ ఎంట్రీకి ముందు అలా..

'వారసుడు'
టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'వారసుడు' తమిళం, తెలుగులో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కుటుంబ కథా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి పోటీలో విడుదలై కూడా భారీ కలెక్షన్లు సాధించడం విశేషం. తెలుగు మార్కెట్‌లో కూడా విజయ్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది.

సీఎం విజయ్ కోసం అనిల్ రావిపూడి రంగంలోకి.. జన నాయగన్ స్టోరీ వెనుక అసలు కథ ఇదే..
సీఎం విజయ్ కోసం అనిల్ రావిపూడి రంగంలోకి.. జన నాయగన్ స్టోరీ వెనుక అసలు కథ ఇదే..

మాస్టర్
విజయ్ దళపతి, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన 'మాస్టర్'. ఈ సినిమా కరోనా ఆంక్షల సమయంలో విడుదలైంది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఆ పరిస్థితుల్లో ఇంత పెద్ద వసూళ్లు సాధించడం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డుగా మారింది. విజయ్ మార్కెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ సినిమా నిరూపించింది.

'జన నాయగన్‌' కోసం విజయ్‌కి రికార్డ్ రెమ్యునరేషన్! దళపతి చివరి మూవీకి పారితోషికం ఎన్ని కోట్లంటే?
'జన నాయగన్‌' కోసం విజయ్‌కి రికార్డ్ రెమ్యునరేషన్! దళపతి చివరి మూవీకి పారితోషికం ఎన్ని కోట్లంటే?

'జన నాయగన్' ముందు ఉన్న ఛాలెంజ్ ఇదే..
ఇప్పుడు అందరి దృష్టి 'జన నాయగన్' బాక్సాఫీస్ ప్రస్థానంపైనే ఉంది. ఇది విజయ్ నటుడిగా చేస్తున్న చివరి సినిమా. రాజకీయాల్లోకి వెళ్లే ముందు అభిమానులకు ఇచ్చే వీడ్కోలు సినిమా. ఈ ఒక్క అంశమే సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది. తొలి రోజు పబ్లిక్ టాక్ కూడా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. భారీ ఓపెనింగ్స్, తొలి వారాంతంలో స్ట్రాంగ్ కలెక్షన్లు సాధిస్తే 'లియో' రికార్డును సులభంగా అధిగమించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను చూస్తే.. ఈ సినిమా 1000 కోట్ల కూడా గ్రాస్ చేసే అవకాశముందని అభిమానాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జన నాయగన్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో వేచి చూడాలి.

Read more about: thalapathy vijay leo jana nayagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X