The Odyssey 6 Days Box Office: 100 కోట్ల వైపు దూసుకెళ్తున్న ది ఒడిస్సీ.. నోలన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ఈతాకా గ్రీక్ సమ్రాజ్యాధినేత ఒడిస్సీ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ట్రోజాన్ వార్ తర్వాత చోటు చేసుకొన్న సంఘటలన నేపథ్యంగా ది ఒడిస్సీ మూవీని ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రూపొందించారు. ఒడిస్సీగా మాట్ డామన్, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నె హత్‌వే నటించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ నటించారు. ఈ సినిమాను ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్ నిర్మించారు.
ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయ్‌తేమ, ఎడిటర్: జెన్నిఫర్ లామే, మ్యూజిక్: లడ్‌విగ్ గోరాన్సన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. యూనివర్సల్ పిక్చర్స్ , సింకోపి బ్యానర్లపై రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో, ఇతర దేశాల్లో జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రం ఇండియాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం తొలి రోజు ఏ మేరకు వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాను అతి తక్కువ ఖర్చుతో 70 ఎంఎం ఐమాక్స్ వెర్షన్‌లో షూట్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 275 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు.ఈ సినిమా కోసం 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే.. ప్రమోషనల్ ఈవెంట్స్, యాడ్స్ కోసం 25 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. దాంతో ఈ సినిమా సుమారుగా భారతీయ కరెన్సీలో 2650 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు.
ఇక ఈ సినిమా ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మొదటి రోజు ఈ సినిమా 17 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా టాక్ పాజిటివ్‌గా ఉండటంతో తొలి రోజు కంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ రెండో రోజు 22 కోట్ల రూపాయలు, మూడో రోజు 22 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 8 కోట్ల రూపాయలు, 5వ రోజు 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 78 కోట్ల రూపాయల నెట్, 93 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 126 మిలియన్ డాలర్లు, ఓవర్సీస్‌లో 139 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం 265 మిలియన్ డాలర్లు రాబట్టింది. అయితే ఈ సినిమా సోమవారం రోజున వరల్డ్ వైడ్‌గా 18.7 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా టాయ్ స్టోరి, ఓపెన్ హైమర్ సినిమా రికార్డులను అధిగమించింది.
ఇక ఈ చిత్రం 6వ రోజు కూడా ఇండియాలో భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ చిత్రం మంగళవారం 6 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధిస్తుంది. దాంతో ఈ చిత్రం 99 కోట్ల రూాపాయల గ్రాస్ కలెక్షన్లతో 100 కోట్లకు ఇంచు దూరంలో ఉంది. బుధవారం ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications


