The Odyssey Day 3 Collections: ది ఒడిస్సీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. నోలన్ మూవీకి ఎన్ని వేల కోట్ల కలెక్షన్స్ అంటే?
హాలీవుడ్ దర్శక దిగ్గజం క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్‌గా తెరకెక్కించిన మూవీ ది ఒడిస్సీ. జూలై 17న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ది ఒడిస్సీలో మాట్ డామన్, అన్నె హత్‌వే, టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. యూనివర్సల్ పిక్చర్స్, సింకోపి బ్యానర్లపై ఎమ్మా థోమస్, క్రిస్టోఫర్ నోలన్‌లు సంయుక్తంగా నిర్మించారు. ది ఒడిస్సీకి హోటే వాన్ హోటేమా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జెన్నీఫర్ లామ్ ఎడిటర్‌గా, లూడ్విగ్ గోరాన్‌సన్ సంగీతం అందించారు. తొలి రెండు రోజులు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ది ఒడిస్సీ మూవీ మూడో రోజు వరల్డ్ వైడ్‌గా ఎంత వసూలు చేసింది? భారత్‌లో కలెక్షన్స్ ఎంత? అనేది పరిశీలిస్తే..
ది ఒడిస్సీ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్ కలిపి ది ఒడిస్సీ మూవీని 250 మిలియన్ డాలర్లు (2400 కోట్ల రూపాయలు) భారీ బడ్జెత్‌తో తెరకెక్కించినట్లుగా హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలు, మార్కెటింగ్ నిమిత్తం మరో 125 మిలియన్ డాలర్లు (1200 కోట్ల రూపాయలు) ఖర్చు చేశారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 625 మిలియన్ డాలర్లు (6017 కోట్ల రూపాయలు) వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ది ఒడిస్సీ రెండ్రోజుల కలెక్షన్స్
క్రిస్టోఫర్ నోలన్ మూవీ ప్రీమియర్స్+ తొలి రోజున నార్త్ అమెరికాలో 51.2 మిలియన్ డాలర్లు (492 కోట్ల రూపాయలు), రెండో రోజున 74 మిలియన్ డాలర్లు (712 కోట్ల రూపాయలు) చొప్పున రెండ్రోజుల్లో 125 మిలియన్ డాలర్లు (1203 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో రెండ్రోజుల వరకు 132.8 మిలియన్ డాలర్లు (1278 కోట్ల రూపాయలు) రాబట్టింది. మొత్తంగా నార్త్ అమెరికా+ ఇంటర్నేషనల్ మార్కెట్ కలిపి రెండ్రోజుల్లో ది ఒడిస్సీ మూవీ 257.8 మిలియన్ డాలర్లు (2482 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
భారత్‌లో ది ఒడిస్సీ రెండ్రోజుల కలెక్షన్స్
తొలిరోజున క్రిస్టఫర్ నోలన్ మూవీ ఇండియాలో 17.40 కోట్ల రూపాయలు, రెండో రోజున 22 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. రెండు రోజుల వరకు భారత్‌లో 39.40 కోట్ల రూపాయల నెట్.. 47.03 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. మహారాష్ట్రలో 9.67 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 8.05 కోట్ల రూపాయలు, ఢిల్లీలో 6.78 కోట్ల రూపాయలు, తెలంగాణలో 5.17 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 2.18 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4.13 కోట్ల రూపాయలు, కేరళలో 2.92 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
భారత్‌లో మూడో రోజు వసూళ్ల అంచనా
ఇండియాలో ది ఒడిస్సీ మూవీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. వీకెండ్ కారణంగా యువత, కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు పోటెత్తుతున్నారు. ఒక భారతీయ హీరో సినిమాకు ఏ రేంజ్‌లో వసూళ్లు వస్తాయో అదే స్థాయిలో ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతోంది. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు 5172 షోలు ప్రదర్శించబడి 55 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. మూడో రోజు ఇప్పటి వరకు ఇండియాలో ఈ సినిమాకు 10.62 కోట్ల రూపాయల నికర వసూళ్లు వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆదివారం ది ఒడిస్సీ మూవీకి భారత్‌లో 25 నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుందని చెబుతున్నారు. దాంతో ఇండియాలో ఈ సినిమా 3 రోజుల్లోనే 80 కోట్ల రూపాయల మార్క్ చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక మూడో రోజు ది ఒడిస్సీ వరల్డ్ వైడ్‌గా 80 నుంచి 100 మిలియన్ డాలర్లు (962 కోట్ల రూపాయలు) రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తద్వారా తొలి వారాంతంలో ఈ సినిమా 350 మిలియన్ డాలర్లకు పైగా (3369 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి క్రిస్టోఫర్ నోలన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications



