The Paradise Business: ఆ ఏరియాలో ది ప్యారడైజ్‌‌కు కళ్లు చెదిరే బిజినెస్.. నాని మూవీ రైట్స్ ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్‌పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హైప్‌కు తగినట్లుగా ఈ సినిమా బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ది ప్యారడైజ్ థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’

ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ది ప్యారడైజ్ సినిమాను దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో నాని సరసన సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాఘవ్ జుయల్, మోహన్ బాబు, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ది ప్యారడైజ్‌కు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా.. సీహెచ్ సాయి సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. తోట శ్రీనివాస్ డైలాగ్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు.

The Paradise Business Nani s film Nizam rights acquired by Mythri Distributors with record price

ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతుండటం, ఇతర కారణాలతో ది ప్యారడైజ్ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. తొలుత ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అన్నారు.. అప్పుడు వరుస సినిమాలు ఉండటంతో ఆగస్ట్ 21కి వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ 24కి వాయిదా పడినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, ప్రమోషనల్ కార్యక్రమాలకు తగినంత సమయం లేకపోవడం, జూలై, ఆగస్ట్‌లలో బడా సినిమాల రిలీజ్‌లు ఉండటంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Recommended For You
అఖిల్‌‌తో ముద్దు కావాలన్న సీరియల్ నటి.. అక్కినేని హీరో రిప్లయ్ అలా!
అఖిల్‌‌తో ముద్దు కావాలన్న సీరియల్ నటి.. అక్కినేని హీరో రిప్లయ్ అలా!

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడం, ఇప్పుడు అదే జోడీ మరోసారి రిపీట్ అవుతుండటంతో ది ప్యారడైజ్‌పై హైప్ క్రియేట్ అవుతోంది. నాని డిఫరెంట్ లుక్.. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, ఫస్ట్ గ్లింగ్స్, ఆయా షేర్ సాంగ్ ఈ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. దానికి తగినట్లుగానే ది ప్యారడైజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ది ప్యారడైజ్ డిజిటల్ రైట్స్‌కు సంబంధించి డీల్ ఇప్పటికే క్లోజ్ చేసినట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ కోసం పలు కంపెనీలు బరిలో నిలవగా.. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 58 కోట్ల రూపాయలు వెచ్చించి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

You May Also Like
క్లోజ్ ఫ్రెండ్సే అలా చులకనగా.. భార్యతో ఏజ్ గ్యాప్‌పై సాయాజీ షిండే రియాక్షన్
క్లోజ్ ఫ్రెండ్సే అలా చులకనగా.. భార్యతో ఏజ్ గ్యాప్‌పై సాయాజీ షిండే రియాక్షన్

తాజాగా ది ప్యారడైజ్ నైజాం రైట్స్‌కి సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. తొలుత ఈ ఏరియా హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దక్కించుకున్నట్లుగా ఊహాగానాలు వినిపించగా.. చిత్ర యూనిట్ ఖండించింది. ది ప్యారడైజ్ విషయంలో వచ్చే వదంతులు నమ్మొద్దని, ఏమైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ది ప్యారడైజ్ నైజాం థియేట్రికల్ రైట్స్‌ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 37 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే నైజాంలో ది ప్యారడైజ్ బ్రేక్ఈవెన్ కావాలంటే దాదాపు 75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నాని ఊపు చూస్తుంటే థియేట్రికల్, నాన్ థియేట్రికల్‌తో కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 200 కోట్ల రూపాయలు దాటించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Read more about: The Paradise nani srikanth odela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X