twitter
    CelebsbredcrumbKrishnabredcrumbBiography

    కృష్ణ బయోగ్రఫీ

    సూపర్ స్టార్ కృష్ణ గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపానగల బుర్రుపాలెం అనే గ్రామంలోమధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ప్రాధమిక విద్య సొంతూరులోనే పూర్తిచేసి, యస్.యస్.సి తెనాలిలోను, ఇంటర్ మీడియట్ నర్సాపూర్ లోను పూర్తిచేసారు. తరవాత ఏలూరు సి.ఆర్.ఆర్. కాలేజీలో బి.ఎస్సి పట్టా పొందారు. చదువుకునే రోజుల్లోనే నటనమీద ఆసక్తి కనబరచిన కృష్ణ తరవాత సినీ రంగప్రవేశం చేసి 'పదండి ముందుకు', 'కులగోత్రాలు', 'పరువు-ప్రతిష్ట' వంటి చిత్రాల్లో నటించిన గుర్తింపు రాలేదు. ఆ సమయంలో ఆదుర్తి సుబ్బారావు గారు కొత్తవాళ్ళతో నిర్మిస్తున్న 'తేనెమనసులు' ప్రకటన చూసి ప్రయత్నించి, ఎంతో పోటీని తట్టుకుని సినిమాలో ముఖ్య భూమికను పోషించారు. ఆ సినిమా హిట్అవటంతో ఆదుర్తి అదే తారాగణంతో 'కన్నెమనసులు' ప్రారంబించగా, అదే సమయంలో కృష్ణ కు డుండి 'గూడచారి 116 ' లో అవకాశం దక్కింది. 'కన్నె మనసులు'  పారాజయంపాలైనా గూడచారి 116 విజయంతో యాక్షన్  హీరోగా స్థిరపడ్డారు. 

    ఆ తరవాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దాదాపు 350 చిత్రాలలో నటించారు.  హీరోగా ఒక సంవత్సర కాలంలో అత్యదిక సినిమాలు విడుదల అయిన రికార్డు ఇప్పటికి కృష్ణ పేరిటే ఉండటం విశేషం. నిర్మాతల హీరోగా కీర్తిగడించిన కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమకు ఎక్కువ 'తోలి' లు అందించిన వ్యక్తిగా నిలిచిపోయారు. తోలి సిక్రెట్ ఏజెంట్, తోలి కౌ బాయ్, తోలి సినిమా స్కోప్, తోలి 70 ఎమ్.ఎమ్. ఇలా అన్ని కృష్ణపేరిటే ఉండటం విశేషం.

    కృష్ణ తదుపరి కాలంలో పద్మాలయ స్టూడియోస్ నిర్మించి మోసగాళ్ళకు మోసగాడు, పాడిపంటలు, అల్లూరి సీతారామరాజు వంటి చిత్రాలతోపాటు పలు హిందీ సినిమాలను కూడా నిర్మించారు. దర్శకుడిగా సింహాసనం, కొడుకు దిద్దిన కాపురం, నాగాస్త్రం వంటి చిత్రాలను రూపొందించారు.   దాదాపు 350  చిత్రాలలో నటించిన కృష్ణ 100 వ చిత్రం ' అల్లూరి సీతారామరాజు', 200 వ చిత్రం 'ఈనాడు', 300 వ చిత్రం తెలుగు వీర లేవరా.

    మరణం
    సూపర్ స్టార్ కృష్ణ (81), 2022 నవంబర్ 13  (ఆదివారం) రాత్రి గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 2022 నవంబర్ 15  (మంగళవారం) తెల్లవారుజామున కన్నుమూశారు.
     
    ప్రయోగాల హీరో సూపర్ స్టార్ కృష్ణ 
     
    జేమ్స్ బాండ్, కౌబాయ్, 70 ఎమ్ ఎమ్, ఈస్టమన్ కలర్ నుంచి రంగుల సినిమా ఇలా అనేక రకాల జోనర్లను, కొత్త సాంకేతికతను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.  సొంతం బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ ను స్థాపించి.. అనేక సినిమాలను తెరకెక్కించారు.  భారతదేశంలోనే తొలి యాక్షన్ కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఇప్పటికీ వెండి తెరపై చెరగని ముద్రే.

    హాలీవుడ్ సినిమా స్టైల్ లో కౌబాయ్ సినిమాల జానర్ తో  కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో మోసగాళ్ళకు మోసగాడు సినిమా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్లోనే తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులోనే కాదు.. భారతదేశంలోనే తొలి యాక్షన్ కౌబాయ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో 1971లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యింది. రిలీజైన ప్రతి భాషలోనూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.  సింహాసనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మొదటిసారిగా 70 ఎమ్ ఎమ్ ని పరిచయం చేశారు.

    తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే.. అంతేకాదు కృష్ణ ఒకానొక సమయంలో రోజుకి మూడు షిప్ట్ ల చొప్పున పని చేస్తూ.. ఏడాదికి 10 సినిమాలను పూర్తి చేశారు. అంటే 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. కృష్ణ ఒకే ఏడాది 17 సినిమాలను విడుదల చేసి రికార్డు సృష్టించాడు. 1972లో కృష్ణ హీరోగా నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి. ప్రపంచంలో మరే సినీ నటుడికీ ఇలాంటి రికార్డు లేదు. 
     
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X