CelebsbredcrumbAllu Arjun
  అల్లు అర్జున్

  అల్లు అర్జున్

  Actor
  Born : 08 Apr 1983
  Birth Place : హైదిరాబాద్
  అల్లు అర్జున్ తెలుగు సిని నటుడు అభిమానులందరు బన్నీ, స్టయిలిష్ స్టార్ అని పిలుసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్, 8 Apr 1983 అల్లు అరవింద్ మరియు శ్రీమతి నిర్మల  గారికి మద్రాసు లో జర్మించారు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ జననం... ReadMore
  Famous For
  అల్లు అర్జున్ తెలుగు సిని నటుడు అభిమానులందరు బన్నీ, స్టయిలిష్ స్టార్ అని పిలుసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్, 8 Apr 1983 అల్లు అరవింద్ మరియు శ్రీమతి నిర్మల  గారికి మద్రాసు లో జర్మించారు.

  స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ జననం మద్రాసులో జరిగింది. ప్రాదమిక విద్య అనంతరం యానిమేషన్ లో కోర్స్ పూర్తిచేసి కెనడాలో ఫై చదువులు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ 'డాడీ' సినిమాలో ప్రత్యెక పాత్రలో నటించి ఆకర్షించాడు. ఆ తరవాత  అనూహ్యంగా వచ్చిన 'గంగోత్రి' (2003) సినిమాలో అవకాశంతో పూర్తిస్థాయి నటుడిగా మారాడు. 

  హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద...
  Read More
  • సామి సామి ఫుల్ వీడియో సాంగ్ - పుష్ప
  • శ్రీవల్లి ఫుల్ వీడియో సాంగ్- పుష్ప
  • శ్రీవల్లి ఫుల్ వీడియో సాంగ్- పుష్ప
  • దాక్కో దాకో మేక ఫుల్ వీడియో సాంగ్ - పుష్ప
  • ఊ అంటావా మావా.. ఊ.. ఊ అంటావా మావా లిరికల్ వీడియో సాం..
  • పుష్ప మూవీ ట్రైలర్
  • 1
   అల్లు అర్జున్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులంతా ఆయనను ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు. తన డ్యాన్స్ లతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా, తన నటనతోనూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడీ అల్లు వారి అబ్బాయి.
  • 2
   అల్లు వారి వారసుడిగా గంగోత్రి తెరంగేట్రం చేసిన ఈ కుర్రాడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. క్లాస్ అయినా.. మాస్ అయినా.. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అయినా.. ఫ్యామిలీ అయినా.. యాక్షన్ అయినా.. మల్టీ స్టారర్ రోల్స్ అయినా..ఎక్సపరింమెంటల్ తో పాటు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోవడంలో తనను తాను బాగానే మలచుకున్నాడు.
  • 3
   అల్లు అర్జున్ 1982లో ఏప్రిల్ 8వ తేదీన తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మలకు జన్మించాడు. అల్లుఅర్జున్ చిన్ననాటి నుండి సుమారు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు అక్కడే పెరిగాడు. దీంతో చెన్నైలోనే చదువుకున్నాడు. అల్లు అర్జున్ కు ఓ సోదరుడు అల్లు శిరీష్.. మరో సోదరుడు అల్లు వెంకటేష్ కూడా ఉన్నాడు.
  • 4
   అల్లు అర్జున్ కు చిన్ననాటి నుండే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన చిన్నప్పుడే వారి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగితే రామ్ చరణ్, అల్లు అర్జున్ పోటీ పడి మరీ డ్యాన్సులు చేసేవారట. తనలోని ప్రతిభను గుర్తించిన మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమాలో ఓ పాత్రలో నటించేందుకు అవకాశమిచ్చాడు.
  • 5
   అల్లు అర్జున్ డాడీ సినిమాలో కంటే ముందుగానే ‘విజేత‘ సినిమాలో ఓ బాల్య నటుడి పాత్రలో నటించాడు. ఆ తర్వాతే డాడీ సినిమాలో డ్యాన్సర్ గా కనిపించాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ‘గంగోత్రి ద్వారా కథానాయకుడిగా తెలుగు వెండి తెరపై అడుగు పెట్టాడు.
  • 6
   అల్లు అర్జున్ 2011లో హైదరాబాద్ సిటీలో మార్చి 6వ తేదీన స్నేహాలతా రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబమంటే అల్లు అర్జున్ కి ఎంతగానో ఇష్టం. ముఖ్యంగా పిల్లలంటే చాలా ప్రేమ. అందుకే తనకు వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటాడు. తన సరదా వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాడు.
  • 7
   గంగోత్రి సినిమా తర్వాత ఆర్యలో నటించిన అల్లు అర్జున్ ఒక్కసారిగా కాలేజీ బాయ్ గా కనిపించి యువత మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ బన్నీలో తన యాక్టింగ్, డ్యాన్స్, మ్యానరిజంతో చెరగని ముద్ర వేసుకున్నాడు.
  • 8
   అల్లు అర్జున్ తెలుగులోనే కాదు తమిళం, మళయాళంతో పాటు ఇతర భాషలలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటికీ మళయాళంలో తను నటించిన సినిమాలన్నీ దాదాపు డబ్బింగ్ అయి అక్కడ విడుదలవుతున్నాయంటే, తన రేంజ్ ఏ మాత్రం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
  • 9
   అప్పటి వరకు తెలుగు సినిమా రంగంలో ఎవ్వరూ కనిపించని విధంగా ‘దేశ ముదురు‘లో సిక్స్ ప్యాక్ తో కనిపించి అందరినీ అలరించాడు అల్లు అర్జున్. అప్పటినుండి చాలా మంది హీరోలు అదే ట్రెండ్ ను ఫాలో అయ్యారు. ఈ సినిమాకు రెండు నంది అవార్డులు కూడా దక్కాయి.
  • 10
   అప్పటి నుండి అల్లు అర్జున్ తన డ్రస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, బాడీ షేప్ తో పాటు ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకునేవాడట. అందుకే ఆయనకు అభిమానులు కాదు ఆర్మీ ఉంది అని చెబుతుంటాడు.
  • 11
   అల్లు అర్జున్ అప్పుడప్పుడు తన పిల్లలను షూటింగులకు కూడా తీసుకెళతాడు. తన పిల్లలకు తండ్రిగా ఏమి చేస్తున్నారన్న విషయం తెలియాలని అందుకే తన పిల్లలను సినిమా షూటింగులకు తీసుకెళ్తుంటానని చెబుతుంటాడు అల్లు అర్జున్.
  • 12
   అల్లు అర్జున్ నటించిన చాలా చిత్రాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ స్టైలిష్ స్టార్ ‘పరుగు‘, ‘వేదం‘, ‘రేసు గుర్రం‘ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. అంతేకాదు ‘రుద్రమదేవి‘ చిత్రానికి ఉత్తమ సహయనటుడిగా కూడా అవార్డులను అందుకున్నాడు. వీటితో పాటు ఇతర అవార్డులను చాలానే అందుకున్నాడు.
  అల్లు అర్జున్ వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X