యస్ పి బాలసుబ్రమణ్యం బయోగ్రఫీ

  ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 న అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామములో  బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు

  ఎస్పీ బాలు అసలు పేరు శ్రీ ప‌తి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4వ తేదీన నెల్లూరులో పీ సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, నాలుగు చెల్లెలు. అందులో గాయని ఎస్పీ శైలజ, ఎస్పీ వసంత సుపరిచితులు. ఎస్పీ బాలసుబ్రమణ్యం వివాహం సావిత్రితో జరిగింది. ఆయనకు పల్లవి, ఎస్పీ చరణ్ సంతానం ఉన్నారు.

  ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పీ కోదండపాణి శిష్యరికంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం 1966లో డిసెంబర్ 15 తేదీన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. 1981లో ఏక్ దూజే కే లియే చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు లభించింది. 1983లో సాగర సంగమం, 1986లో స్వాతిముత్యం, 1988లో రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకొన్నారు.

  ఎస్పీ బాలసుబ్రమణ్యం గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్‌గా, డబ్బింగ్ హోస్ట్‌గా కాకుండా నటుడిగా అద్బుతమైన పాత్రలు పోషించారు. మన్మధలీలై చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధరణ్, సల్మాన్ఖాన్, కే భాగ్యరాజా, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమిని గణేషన్, అర్జున్ సర్జా, నాగేశ్, కార్తీక్, రఘువరన్ లాంటి ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు.

  నటుడిగా 1969లో పెళ్లంటే నూరేళ్ల పంట చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పక్కింటి అమ్మాయి, ప్రేమ, వివాహ భోజనంబు, కళ్లు, చెన్నపట్నం చిన్నోడు, ప్రేమికుడు, గుణ, పవిత్రబంధం, మిథునం, దేవస్థానం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. చివరిసారిగా దేవదాస్ చిత్రంలో నటించారు. నటుడిగానే కాకుండా సంగీత నేపథ్యం ఉన్న టెలివిజన్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు.

   40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.

  ఆగస్టు 5 తేదీన కరోనా వ్యాధి బారిన పడిన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 29/09/2020న కన్నుమూశారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X