ఎస్ ఎస్ రాజమౌళి
Born on 10 Oct 1973 (Age 49) కొవ్వురు, ఆంద్రప్రదేశ్
ఎస్ ఎస్ రాజమౌళి బయోగ్రఫీ
ఎస్. ఎస్. రాజమౌళి 1973 అక్టోబరు 10న జన్మించారు తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.
రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత.
ఇప్పటివరకు 11 సినిమాలు తీసాడు అన్ని సూపర్ హిట్ సాదించాయి అంతేకాకుండా ఆ సినిమాలలో నటించిన హీరోలు అగ్రకథనాయకులు అయ్యిపోయారు. రాజమౌళి సినిమా అంటే హీరో ఎవరైన సరే సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అంతే అనేలా ముద్ర వేసారు.
స్టూడెంట్ నంబర్1 మొదలైన సినీ ప్రస్థానం సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి :ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూషన్ సినిమాలకు దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా జూ ఎన్టీఆర్,రాం చరణ్ హిరోలతో తెరకెక్కిస్తున్నారు.
సంబంధిత వార్తలు