షణ్ముఖ్ జస్వంత్ ఒక ప్రముఖ యూట్యూబర్, డాన్సర్ అలాగే నటుడు. అతను సెప్టెంబర్ 16, 1994, శుక్రవారం, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో అప్పారావు ఉమారాణి దంపతులకు జన్మించారు. అతనికి సంపత్ వినయ్ అనే అన్నయ్య ఉన్నారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. 2012 లో, షన్ను తన స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించి తన కెరీర్‌ను ప్రారంభించాడు.
అతని మొదటి వీడియో పేరు క్యాడ్‌బరీ లడ్డు యాడ్ బై షణ్ముఖ్. ఆ తర్వాత అతను వైవా (వైవా హర్షతో పాటు) అనే ఒక వీడియో సిరీస్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇది ఎంటర్ టైన్మెంట్ అందించే ఒక యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేసి ఫేమస్ అయ్యాడు. 2013 లో, "శబరీష్ కాండ్రేగుల వైవా" తో, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో షన్ను తన సహ నటులను డామినేట్ చేసి నటించాడు.
ఆ తర్వాత అతను ఇంటర్వ్యూ బై శబరీష్ కాండ్రేగుల (2013), ది బిగ్ ఫ్యాట్ ప్రపోజల్ (2016), మరియు వైవా న్యూస్ సిరీస్‌ల ద్వారా ఇంటర్వ్యూ వంటి వివిధ వీడియోలలో నటించాడు. యూట్యూబ్ వీడియోలలో నటించడమే కాకుండా, షణ్ముఖ్ హోసన్న, కాలా చష్మా, బెజుబాన్ మరియు 'యు అండ్ మీ' (ఖైదీ నంబర్ 150) వంటి పాటలలో డ్యాన్స్ కవర్‌లు చేసి మరింత ఫేమస్ అయ్యాడు. 'యు అండ్ మీ' పాటతో, అతను డ్యాన్సర్ గా కూడా మంచి గుర్తింపు పొందారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పదవ కంటెస్టెంట్ గా షణ్ముఖ్ జస్వంత్ ఎంటర్ అయ్యారు.