»   » రోబో-2... తెరపైకి మన మెగాస్టార్ పేరు, నిజమా?

రోబో-2... తెరపైకి మన మెగాస్టార్ పేరు, నిజమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం '2.0'. ఇంతకు ముందు వచ్చిన 'రోబో' చిత్రానికి ఇది సీక్వెల్. రూ. 360 కోట్ల పై చిలుకు బడ్జెట్ హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తుండటం మరో హైలెట్.

రజనీకాంత్, శంకర్ చిత్రాలకు తెలుగులోనూ భారీ మార్కెట్ ఉన్న నేపథ్యంలో.... ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో తెలుగు స్టార్ ఎవరైనా గెస్ట్ రోల్ చేస్తే బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారట. ఈ మేరకు దర్శక నిర్మాతలు తమ ప్రయత్నాలో ఉన్నారని తెలుస్తోంది.


గెస్ట్ రోల్ చేసేది మరెవరో కాదు... టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అనే టాక్ వినిపిస్తోంది.


రజనీస్థాయిలో ఉండాలనే

రజనీస్థాయిలో ఉండాలనే

రజనీకాంత్ సినిమాలో గెస్ట్ రోల్ అంటే.. ఆయన స్థాయికి తగిన విధంగానే ఉండాలి. అలా చూస్తే చిరంజీవి తప్ప మరెవరూ సరితూగే అవకాశమే లేదు. అందుకే మెగాస్టార్ తో గెస్ట్ రోల్ చేయించాలని డిసైడ్ అయ్యారని టాక్.


చిరంజీవి కోరిక కూడా

చిరంజీవి కోరిక కూడా

చిరంజీవి తన కోరీర్లో ఎంతో మంది పెద్ద డైరెక్టర్లతో చేసారు. అయితే శంకర్ దర్శకత్వంలో చేయలేక పోయారు. ఆయనతో కలిసి సినిమా చేయాలనే కోరికను ఆయనపలు సందర్భంల్లో బయట పెట్టారు కూడా. ఇపుడు పరిస్థితులు కలిసి రావడంతో ఇలా కాంబినేషన్ సెట్టయిందట.


ఖర్చు భారీగా

ఖర్చు భారీగా

ఇండియాలో ఇది వరకు ఏ సినిమాకు పెట్టనంతగా ‘2.0' చిత్రానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇటీవల సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం ముంబైలో ఏర్పాటు చేసారు. ఈ ఈవెంటు కోసమే దాదాపు 4 నుండి 5 కోట్లు ఖర్చు చేసారట. సినిమా పబ్లిసి కోసమే బడ్జెట్ నుండి రూ. 40 కోట్ల వరకు కేటాయిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.


చిరు 150: షూటింగ్ పూర్తయింది....

చిరు 150: షూటింగ్ పూర్తయింది....

చిరు 150: షూటింగ్ పూర్తయింది.... (న్యూ ఫోటోస్ రిలీజ్ అయ్యాయి. చిరంజీవి చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఫోటోస్ చూసేందుకు క్లిక్ చేయండి)


హీరో ధనుష్ మా కొడుకే.. సాక్ష్యాలతో కోర్టుకెక్కిన దంపతులు!

హీరో ధనుష్ మా కొడుకే.. సాక్ష్యాలతో కోర్టుకెక్కిన దంపతులు!

హీరో, రజనీకాంత్ అల్లుడు... ధనుష్ తన కుమారుడే అంటూ ఓ ఇద్దరు వృద్ధ దంపతులు కోర్టు కెక్కారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన తమిళనాడులోని మేలూరు కోర్టు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


English summary
Film Nagar source said that, Tollywood Megastar Chiranjeevi to play a cameo in Rajinikanth's 2.0 film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu