Samantha: సమంత సీక్రెట్ రిలేషన్షిప్.. ఆ ఒక్క పోస్ట్‌తో బయటపడ్డ బండారం!
సమంత.. సమంత.. సమంత ఈ పేరు అస్సలు వినపడకుండా ఉండట్లేదు. ఏదో ఒక విషయంలో ట్రెండ్ లేదా ట్రోల్ అవుతూనే ఉంటోంది. తాజాగా ఈమె గురించి మరో హాట్ టాపిక్ విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే ఆ మధ్య ఈమె మరోసారి ప్రేమలో పడిందంటూ, పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమె సీక్రెట్ రిలీషన్షిప్ బయటపడిందంటూ ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడంతా దీని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యగాను పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే సరైన కారణాలు చెప్పకుండా విడాకుల ఇచ్చిందో అప్పుడు నుంచి విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. ప్రొఫెషనల్ పరంగా కెరీర్ పీక్ స్టేజ్‌కు వెళ్లినప్పటికీ పర్సనల్ లైఫ్ పరంగా మాత్రంగా ఇప్పటికీ బాగా ట్రోల్ అవుతూనే ఉంది.

ఈమె విడాకులు తీసుకున్నాక లవ్ అఫైర్స్ పెట్టుకున్నట్లు కూడా మాట్లాడుకున్నారు. వేరే వారి మాయలో, మోజులో పడిందని కూడా అన్నారు. అందులో ఎక్కువగా గట్టిగా వినిపించిన పేరు సామ్ హెయిర్ స్టైలిస్ట్ పీతమ్ జుకల్కర్. ఇతడితో సామ్ సైలెంట్ రిలేషన్షిప్ మెయిన్ టెయిన్ చేసిందని చాలా మంది చెప్పుకొచ్చారు. ఎందుకంటే వీరిద్దరు కలిసి దిగే ఫొటోలు అలా ఉండేవి మరి. అయితే ఈ వార్తలపై ప్రీతమ్ స్పందించి తామిద్దరిది అక్క తమ్ముళ్ల రిలేషన్ అని క్లారిటీ కూడా ఇచ్చాడు.
సరే విషయం ఏదైనా గానీ ఇలాంటి రూమర్స్ రావడంతో గత కొంత కాలంగా వీరిద్దరు కలిసి కనిపించడం మానేశారు. ఈ క్రమంలోనే తాజాగా వీరి రిలేషన్షిప్ గురించి మరోసారి ప్రచారం తెరపైకి వచ్చింది. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో నాగచైతన్య - సమంత ఒకే వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే.తమ సినిమా, వెబ్‌సిరీస్‌లను అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ ఈవెంట్లో సామ్ హీట్ పెంచే రేంజ్లో యమా స్టైల్‌గా వచ్చింది. తన గ్లామర్‌తో స్టేజ్‌కు మంట పెట్టింది.
Om Bheem Bush Movie Twitter Review శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ హిట్టా? ఫట్టా?
సమంత వేసుకున్న ఈకల డ్రెస్‌ను చూసి నెటిజన్లు, అభిమానులు యమా హాట్‌గా ఉన్నావ్ సామ్ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి స్టైలిస్ట్ ప్రీతమ్ జుక్కల్కర్ కూడా కామెంట్స్ చేశాడు. ఏకంగా లవ్ సింబల్స్ ఏమోజీ పెట్టాడు. మరవైపు సమంత కూడా ఈ డ్రెస్‌లోని ఓ పీస్‌ను చూపిస్తూ ఈ ఔట్ ఫిట్‌లో వారియర్ ప్రిన్సెస్‌లా ఉన్నాను. దీన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. ఐ లవ్ యూ గాయ్స్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
ప్రభాస్‌కు పెళ్లి కాకపోవడానికి అసలు కారణం ఇదే! ఇన్నాళ్లకు బయటపెట్టిన పాన్ ఇండియా స్టార్
ఇక ఈ విషయాల్ని అదనుగా తీసుకున్న గాసిప్ రాయుళ్ళు సమంత రిలేషన్షిప్ గురించి మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రీతమ్ పెట్టిన లవ్ పోస్ట్‌ను వైరల్ చేస్తూ సమంత లవ్ సింబల్స్‌తో సీక్రెట్ రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేస్తుందని కామెంట్లు చేయడం ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











