Om Bheem Bush Movie Twitter Review శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ హిట్టా? ఫట్టా?
గత ఏడాది 'సామజవరగమన' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంటింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో పాటు.. ప్రశంసలు లభించాయి. ఇక మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు 'ఓం భీమ్ బుష్' సినిమాతో శ్రీవిష్ణు తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీవిష్ణుతో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నేడు థియేటర్లలో సందడి చేస్తుంది. ఇక ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా సినీ ప్రేక్షకులు తమ రివ్యూను పెడుతున్నారు. అసలు ఈ సినిమా హిట్టా? ఫట్టా? అనేది ఈ పూర్తి కథనంలో తెలుసుకుందాం.
కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీగా..
శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఓం భీమ్ బుష్. వీరి కాంబోలో ఇప్పటికే బ్రోచేవారెవవురా సినిమా వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. మరోసారి వీరు ముగ్గురు కలిసి నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను రూపొందించిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్ సంస్థతో కలిసి సురేష్ బలుసు నిర్మించారు

మంచి బజ్ క్రియేట్...
ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించగా.. ప్రియా వడ్లమాని స్పెషల్ సాంగ్ చేసింది. కామాక్షీ భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్, 'రచ్చ' రవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఓం భీమ్ బుష్ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో శ్రీవిష్ణు నటించిన సామజవరగమన ఫన్ మూవీ తరహాలోనూ ఈ సినిమా ఉంటుందని భావించారు. మరోసారి కడుపుబ్బా నవ్వుకోవచ్చని ప్రేక్షకులు భారీ ఎక్సెపెక్టెషన్స్ పెట్టుకున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చేసింది.
Jabardasth యాంకర్ రష్మీకి ఇమ్మాన్యుయెల్ వార్నింగ్.. ఎక్కువ చేస్తే అలా చేసేస్తానంటూ..!
సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్...
ఇక ఈ సినిమా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకుంది. నైజాం రూ.3 కోట్లు, సీడెడ్ రూ.1 కోటి, ఆంధ్రా రూ.4కోట్లు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 1.2 కోట్లు బిజినెస్ చేసుకుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 'ఓం భీమ్ బుష్' సినిమా రూ.9.30 కోట్ల బిజినెస్ నమోదు చేసుకోగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.10కోట్లతో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. అయితే ఈ సినిమా పదికోట్లు సాధిస్తే.. సూపర్ హిట్టుగా నిలువనుంది.
OTT: ప్రభాస్ కల్కిని బీట్ చేయని దేవర, గేమ్ ఛేంజర్.. ఈ సినిమాల రైట్స్ ఎన్ని వందల కోట్లంటే?
పాజిటివ్ రివ్యూలు...
ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటనుంచే మంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఫన్ అండ్ ఎంటర్టైనర్, నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్, హిల్లేరియస్ ఫన్, అంటూ ట్వీట్స్ పెడుతున్నారు.' రాజా రాజా చోర', 'సామజవరగమన' తర్వాత శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ మరోసారి సూపర్ గా ఉందని మరో వ్యక్తి X వేదికగా ట్విట్ పెట్టారు. మొదటిరోజు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ మరింత పెరగవచ్చని తెలుస్తోంది. మరి ఏం జరగనుందో చూడాలి.


Click it and Unblock the Notifications











