52 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో మలైకా అరోరా? 19ఏళ్ల చిన్నవాడితో...

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ స్పెషల్ సాంగ్స్ చేశారు. 'ఛయ్యా ఛయ్యా', 'మున్నీ బద్నామ్ హుయీ' వంటి పాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక' పాటతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. ఈ అమ్మడు సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత జీవితంతోనే ఆమె ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటారు. తాజాగా ఆమె ప్రేమ జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Also Read
యాంకర్ రష్మీని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. ఇన్నాళ్లు ఈగోలు అడ్డొచ్చాయంటూ..
యాంకర్ రష్మీని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. ఇన్నాళ్లు ఈగోలు అడ్డొచ్చాయంటూ..

మలైకా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను 1998లో వివాహం చేసుకుంది. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే అభిప్రాయ భేదాల కారణంగా 2017లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత మలైకా జీవితంలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ వచ్చారు. ఇద్దరూ చాలా సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. తమ రిలేషన్‌ను ఎప్పుడూ దాచలేదు. పబ్లిక్ ఈవెంట్లు, వెకేషన్లు, పార్టీల్లో కలిసి కనిపిస్తూ వచ్చారు. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.

Recommended For You
'నేను ఆట బొమ్మను కాదు.. అలాంటి ఆఫర్లు అక్కర్లేదు’
'నేను ఆట బొమ్మను కాదు.. అలాంటి ఆఫర్లు అక్కర్లేదు’
Malaika Arora Dating Rumours

అర్జున్ కపూర్ కంటే మలైకా దాదాపు 12 ఏళ్లు పెద్దది. అయినప్పటికీ ఇద్దరూ ఆ విమర్శలను పట్టించుకోలేదు. అయితే గత ఏడాది నుంచి ఇద్దరూ విడిపోయినట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వచ్చాయి. అనంతరం అర్జున్ కపూర్ కూడా తాను ప్రస్తుతం సింగిల్ అని బహిరంగంగా చెప్పడంతో ఆ ప్రచారానికి మరింత ఊతం ఇచ్చినట్టు అయింది. అప్పటి నుంచి మలైకా కొంతకాలం మీడియాకు దూరంగా కనిపించారు. ఇప్పుడు మాత్రం మరోసారి ఆమె ప్రేమ జీవితం గురించి కొత్త చర్చ మొదలైంది.

తాజాగా ప్రముఖ డైమండ్ వ్యాపారవేత్త హర్ష్ మెహతాతో మలైకా డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం బాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. మలైకా అరోరాకు ప్రస్తుతం 52 ఏళ్లు. వయసు పెరుగుతున్నా ఆమె ఫిట్‌నెస్, గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ గత కొంతకాలంగా కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి.

You May Also Like
OTT Releases This Week: శ్రీకాంత్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ నుంచి 'బాలన్: ది బాయ్' వరకు.. ఈ వారం ఓటీటీలో..
OTT Releases This Week: శ్రీకాంత్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ నుంచి 'బాలన్: ది బాయ్' వరకు.. ఈ వారం ఓటీటీలో..

ఇటీవల ముంబైలోని బాంద్రాలో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో మలైకా తన కుమారుడు అర్హాన్ ఖాన్‌తో కలిసి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి హర్ష్ మెహతా కూడా రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరూ ఒకేసారి మీడియా ముందు కలిసి ఫోజులు ఇవ్వలేదు. కానీ ఒకే కార్యక్రమంలో ఉండటం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీంతో వీరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అంతకుముందు కూడా కొన్ని మ్యూజిక్ ఈవెంట్లు, ఇతర ప్రైవేట్ వేడుకల్లో వీరిద్దరూ కనిపించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో డేటింగ్ రూమర్లు మరింత ఊపందుకున్నాయి.

Bigg Boss Telugu 10: నన్ను బిగ్ బాస్‌లోకి తీసుకోండి ప్లీజ్.. నాగార్జున అంటే... బ్రహ్మముడి నటి రిక్వెస్ట్!
Bigg Boss Telugu 10: నన్ను బిగ్ బాస్‌లోకి తీసుకోండి ప్లీజ్.. నాగార్జున అంటే... బ్రహ్మముడి నటి రిక్వెస్ట్!

బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తమ వ్యక్తిగత జీవితాన్ని వీరిద్దరూ ప్రైవేట్‌గా ఉంచాలని భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే బహిరంగంగా కలిసి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై మలైకా అరోరా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. హర్ష్ మెహతా కూడా స్పందించలేదు. అందువల్ల ప్రస్తుతం ఇవి అధికారికంగా ధృవీకరించబడిన విషయాలు కావు. సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. మరికొందరు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ రూమర్లుగానే చూడాలని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X