OTT Releases This Week: శ్రీకాంత్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ నుంచి 'బాలన్: ది బాయ్' వరకు.. ఈ వారం ఓటీటీలో..

OTT Releases This Week: ఓటీటీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు భాషల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, యానిమేటెడ్ షోలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలు కూడా ఈసారి డిజిటల్ వేదికలపై సందడి చేయబోతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు హాలీవుడ్ కంటెంట్ కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. జీ5, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈ వారం వివిధ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!

Also Read
Devara: దేవర వసూళ్లు ఫేకా? నిజమేంటో తేల్చేసిన ప్రముఖ నిర్మాత!
Devara: దేవర వసూళ్లు ఫేకా? నిజమేంటో తేల్చేసిన ప్రముఖ నిర్మాత!

చిన్న చిన్న ఆశై
మధూ షా, ఇంద్రన్స్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా చిన్న చిన్న ఆశై. ఈ సినిమాకు వర్షా వాసుదేవ్ దర్శకత్వం వహించారు. వారణాసి యాత్రకు వెళ్లిన లీలా అనుకోకుండా తన టూర్ గ్రూప్‌కు దూరమవుతుంది. ఆ సమయంలో మాధవన్ అనే వ్యక్తి ఆమెకు సహాయం చేస్తాడు. ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఏర్పాడుతుంది. ఒంటరితనం, బాధలు, నెరవేరని కలలు, కొత్త ఆశలు ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా జూలై 28 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

OTT Releases This Week

'ఆజాదీ 501'
తేజ, హర్షవర్ధన్, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ 'ఆజాదీ 501'. మధ్యతరగతి యువకుడి కలలు, డబ్బు సంపాదించాలని చేసే ప్రయత్నాలు, తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వాలనే ఆలోచన, ఆ తర్వాత జరిగే సంఘటనలు కథలో కీలకం కానున్నాయి. ఈ సిరీస్ జూలై 29 నుంచి స్ట్రీమింగ్ కానున్నది. ఈ సిరీస్‌పై ఇప్పటికే మంచి ఆసక్తి ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఫ్రీడమ్ 251 మొబైల్ స్కామ్ కాన్సెప్ట్‌ను ఆధారంగా తీసుకుని ఈ కథను రూపొందించారు. ట్రైలర్‌కు కూడా మంచి స్పందన లభించింది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే వారికి ఈ సిరీస్ నచ్చే అవకాశముంది. ఆహా ఓటీటీలో జూలై 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Recommended For You
Top 10 Heroines: సమంత హవా.. నయనతారకు ఎదురుదెబ్బ.. కాజల్‌, రష్మిక, సాయిపల్లవి ర్యాంక్స్ ఇవే!
Top 10 Heroines: సమంత హవా.. నయనతారకు ఎదురుదెబ్బ.. కాజల్‌, రష్మిక, సాయిపల్లవి ర్యాంక్స్ ఇవే!

బాలన్: ది బాయ్
ఈ వారంలో అత్యంత ఆసక్తికరమైన సినిమాల్లో 'బాలన్: ది బాయ్' ఒకటి. మలయాళంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది. హత్య కేసులో జైలుకు వెళ్లిన ఓ మహిళ అక్కడే ఓ బిడ్డకు జన్మనిస్తుంది. శిక్ష పూర్తయిన తర్వాత తన గతాన్ని దాచిపెట్టి జీవనం సాగిస్తుంది. కొత్త ప్రాంతంలో కొత్త పేరుతో జీవిస్తుంది. ఒక రోజు ఆమె కనిపించకుండా పోతుంది. తల్లి కోసం వెతికే టీనేజ్ బాలుడి ప్రయాణమే ఈ సినిమా కథ. అతడు తెలుసుకునే నిజాలు కథలో పెద్ద ట్విస్టులుగా మారతాయి. భావోద్వేగాలతో పాటు సస్పెన్స్ కూడా ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. టొవినో థామస్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. జూలై 31 నుంచి జీ5లో ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Recommended For You
Top 10 Heroines: సమంత హవా.. నయనతారకు ఎదురుదెబ్బ.. కాజల్‌, రష్మిక, సాయిపల్లవి ర్యాంక్స్ ఇవే!
Top 10 Heroines: సమంత హవా.. నయనతారకు ఎదురుదెబ్బ.. కాజల్‌, రష్మిక, సాయిపల్లవి ర్యాంక్స్ ఇవే!

గట్టా కుస్తీ 2
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' కూడా ఈ వారంలోనే డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 2022లో వచ్చిన తొలి భాగం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రెండో భాగం మరింత ఆసక్తికరంగా మారింది. విష్ణు విశాల్‌తో పాటు యోగిబాబు, కరుణాస్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

దీవాన
తెలుగు ప్రేక్షకుల కోసం మరో సినిమా 'దీవాన'. హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైంది. కానీ మంచి టాక్ సంపాదించింది. ప్రేమలోని బాధ, త్యాగం, భావోద్వేగాలు ఈ చిత్రంలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని ఇప్పటికే చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా జూలై 31 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ సభ్యులకు ముందుగానే చూసే అవకాశం ఉంటుంది.

You May Also Like
Bigg Boss Telugu 10: నన్ను బిగ్ బాస్‌లోకి తీసుకోండి ప్లీజ్.. నాగార్జున అంటే... బ్రహ్మముడి నటి రిక్వెస్ట్!
Bigg Boss Telugu 10: నన్ను బిగ్ బాస్‌లోకి తీసుకోండి ప్లీజ్.. నాగార్జున అంటే... బ్రహ్మముడి నటి రిక్వెస్ట్!

ఆబ్జెక్షన్ మై లార్డ్
ఈ వారంలో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ ఇదే. సీనియర్ హీరో శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత ఓటీటీలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. 'ఆబ్జెక్షన్ మై లార్డ్ - నోటరీ పరశురామ్: చాప్టర్ 1' కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. న్యాయం కోసం పోరాడే నోటరీ పరశురామ్ పాత్రలో శ్రీకాంత్ నటించారు. ముఖేష్ రిషి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. న్యాయస్థానంలో జరిగే వాదనలు, నేరం వెనుక దాగి ఉన్న కుట్రలు, ఉత్కంఠభరితమైన ట్విస్టులు ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. పోస్టర్ విడుదలైనప్పటి నుంచే మంచి ఆసక్తి నెలకొంది. కోర్ట్‌రూమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది తప్పకుండా చూడాల్సిన సిరీస్‌గా చెప్పొచ్చు. ఈ సిరీస్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Jana Nayagan Day 4 collections: బాక్సాఫీస్‌పై దళపతి విజయ్ దండయాత్ర.. 200 కోట్లకి చేరువగా జన నాయగన్!
Jana Nayagan Day 4 collections: బాక్సాఫీస్‌పై దళపతి విజయ్ దండయాత్ర.. 200 కోట్లకి చేరువగా జన నాయగన్!

హై జవానీ తో ఇష్క్ హోనా హై
వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ బాలీవుడ్ మూవీ హై జవానీ తో ఇష్క్ హోనా హై. ప్రేమ, కామెడీ, కుటుంబ కథాంశాలతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా ఓటీటీలోకి వస్తోంది. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందింది. ఈ సినిమా జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Jana Nayagan AP, TG Collections: జన నాయగన్‌కు భారీ కలెక్షన్లు.. డిజాస్టర్ టాక్‌తో విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Jana Nayagan AP, TG Collections: జన నాయగన్‌కు భారీ కలెక్షన్లు.. డిజాస్టర్ టాక్‌తో విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

బ్యాట్‌మ్యాన్: కేప్డ్ క్రూసేడర్ సీజన్ 2
హాలీవుడ్ అభిమానులకు కూడా ఈ వారం మంచి ట్రీట్ సిద్ధమైంది. 'బ్యాట్‌మ్యాన్: కేప్డ్ క్రూసేడర్' రెండో సీజన్ ప్రైమ్ వీడియోలో జూలై 31 నుంచి విడుదల కానుంది. గోథమ్ నగరంలో జరిగే నేరాలను అడ్డుకునే బ్యాట్‌మ్యాన్ ప్రయత్నిస్తాడు. ఈసారి జోకర్, రిడ్లర్, హార్లీ క్విన్ వంటి ప్రముఖ పాత్రలు మరింత కీలకంగా కనిపించనున్నాయి. యానిమేషన్ అభిమానులతో పాటు సూపర్ హీరో కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది బెస్ట్ ఛాయిస్.

Read more about: amazon prime netflix ott movies
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X