Bigg Boss Telugu 10: నన్ను బిగ్ బాస్‌లోకి తీసుకోండి ప్లీజ్.. నాగార్జున అంటే... బ్రహ్మముడి నటి రిక్వెస్ట్!

Bigg Boss Telugu 10: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్-10కు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తెలుగులో బిగ్ బాస్ షో ప్రారంభమై పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈసారి సీజన్‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి టాస్కులు, హౌస్ డిజైన్ వరకు ప్రతిదీ ప్రత్యేకంగా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని తన మనసులోని కోరికను బహిరంగంగానే వ్యక్తం చేసిన ఓ టీవీ నటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ నటి ఎవరు? ఏమన్నారంటే?

Also Read
బిగ్ బాస్‌లోకి సౌరవ్ గంగూలీ.. దాదా పారితోషికం ఎన్ని కోట్లంటే?
బిగ్ బాస్‌లోకి సౌరవ్ గంగూలీ.. దాదా పారితోషికం ఎన్ని కోట్లంటే?

ఆ నటి మరెవరో కాదు..'బ్రహ్మముడి' సీరియల్‌లో కావ్య పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన దీపిక రంగరాజు. తమిళనాడుకు చెందిన ఈ భామ, తెలుగులో 'బ్రహ్మముడి' సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన సహజ నటనతో పాటు చలాకీతనం, సరదా మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 'కుక్ విత్ జాతిరత్నాలు' వంటి టీవీ షోలలో కూడా సందడి చేస్తూ తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Bigg Boss Telugu 10 Brahmamudi Fame Deepika Rangaraju Wants to Enter the Reality Show
Recommended For You
’చిన్న పెగ్ వేస్తే చిరంజీవిని.. పెద్ద పెగ్‌తో పవన్ కల్యాణ్‌ను టార్గెట్’
’చిన్న పెగ్ వేస్తే చిరంజీవిని.. పెద్ద పెగ్‌తో పవన్ కల్యాణ్‌ను టార్గెట్’

'నన్ను బిగ్ బాస్‌లోకి పిలవాలి'
గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీపిక రంగరాజు.. బిగ్ బాస్‌పై తనకున్న అభిమానాన్ని దాచుకోలేదు. "చాలామంది నన్ను బిగ్ బాస్‌కు వెళ్తారా అని అడుగుతుంటారు. ప్రస్తుతం 'బ్రహ్మముడి' సీరియల్ చేస్తున్నాను కాబట్టి వెళ్లడం కుదరదు. ఆ సీరియల్ పూర్తయిన తర్వాత మాత్రం తప్పకుండా వెళ్లాలని ఉంది." అని ఆమె చెప్పింది. బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపు రాలేదని కూడా దీపిక స్పష్టం చేసింది. "నాకు ఇప్పటివరకు బిగ్ బాస్ నుంచి కాల్ రాలేదు. కానీ అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా వెళ్తాను. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను పిలవాలని నిజంగానే కోరుకుంటున్నాను." అని తన కోరికను వెల్లడించింది.

You May Also Like
Jana Nayagan Day 3 Collections: బాక్సాఫీస్ కింగ్ జన నాయగన్.. సీఎం విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Jana Nayagan Day 3 Collections: బాక్సాఫీస్ కింగ్ జన నాయగన్.. సీఎం విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం మాత్రమే కాదు.. విజేతగా నిలవాలనే లక్ష్యం కూడా తనకు ఉందని దీపిక చెప్పింది. "ఒకవేళ బిగ్ బాస్‌కు వెళ్లితే కేవలం పాల్గొనడానికే కాదు. విన్నర్‌గా బయటకు రావాలి. నాగార్జున గారు నా చేతిని పైకెత్తి విన్నర్ అని ప్రకటించే రోజు చూడాలని ఉంది."అని ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ అంటే గొడవలు, వాదనలు, ఎమోషన్స్ అన్నీ సహజమే. అయితే తాను అలాంటి వ్యక్తిని కాదని దీపిక స్పష్టం చేసింది. 'నేను స్కూల్‌లో అయినా, కాలేజీలో అయినా పెద్దగా ఎవరితో గొడవ పడలేదు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లినా పరిస్థితులకు తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతాను. ఎదుటివాళ్లు ఏం చేసినా ఎక్కువగా పట్టించుకోను'అని తెలిపింది.

Devara: దేవర వసూళ్లు ఫేకా? నిజమేంటో తేల్చేసిన ప్రముఖ నిర్మాత!
Devara: దేవర వసూళ్లు ఫేకా? నిజమేంటో తేల్చేసిన ప్రముఖ నిర్మాత!

ఈసారి సీజన్‌లో అవకాశం వస్తుందా లేదా అన్నది తనకు తెలియదని, కానీ బిగ్ బాస్‌లో పాల్గొనాలనే కోరిక మాత్రం చాలా రోజుల నుంచే ఉందని ఆమె చెప్పింది.ఈ సీజన్‌లో నాకు అవకాశం వస్తుందో లేదో తెలియదు. కానీ ఎప్పటికైనా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టాలని ఉంది
అని పేర్కొంది.

 నా భార్యకు ఎప్పుడో చెప్పా.. కొడుకు పుడితే.. మనసులో కోరిక బయటపెట్టిన అఖిల్!
నా భార్యకు ఎప్పుడో చెప్పా.. కొడుకు పుడితే.. మనసులో కోరిక బయటపెట్టిన అఖిల్!

నాగార్జునపై క్రష్ ?
ఇంటర్వ్యూలో నాగార్జున గురించి కూడా దీపిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "నాకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. నా వయసు వాళ్లకు విజయ్ దేవరకొండ లాంటి హీరోలపై క్రష్ ఉంటుంది. కానీ నాకు మాత్రం నాగార్జున గారినే చూసినా అలాంటి ఫీలింగ్ వస్తుంది."అని నవ్వుతూ చెప్పింది. నాగార్జునను తొలిసారి కలిసిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంది. ఓ షోలో నాగార్జున గారిని డైరెక్ట్‌గా కలిశాను. అప్పుడు నా మనసులో ఏముందో అదే చెప్పాను. చాలామంది అది స్క్రిప్టెడ్ అనుకున్నారు. కానీ కాదు. ఆ సమయంలో నాకు అనిపించిన మాటలనే చెప్పాను. ఆయన చార్మ్ నిజంగానే నన్ను ఆకట్టుకుంది."అని వివరించింది.

ఆఫర్ల కోసం నిర్మాత, దర్శకులతో పడుకో.. భార్యపై అమీర్ ఖాన్ సోదరుడి ఒత్తిడి..
ఆఫర్ల కోసం నిర్మాత, దర్శకులతో పడుకో.. భార్యపై అమీర్ ఖాన్ సోదరుడి ఒత్తిడి..

సీజన్-10లో అవకాశం దక్కుతుందా?
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్-10 కంటెస్టెంట్ల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారిక జాబితా ఇంకా ప్రకటించలేదు. అయితే దీపిక రంగరాజు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఆమెకు ఈసారి అవకాశం దక్కుతుందా? అనే చర్చ బుల్లితెర వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా 'బ్రహ్మముడి' సీరియల్‌తో పాటు ఇతర షోలలో ఆమె చూపిస్తున్న చలాకీతనం, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ దృష్ట్యా బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తే ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించే కంటెస్టెంట్‌గా నిలుస్తారని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు సీజన్-10 కంటెస్టెంట్లపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి దీపిక పాల్గొంటారా లేదా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X