»   » అఖిల్ పెళ్లి రద్దు: సెట్స్‌లో వింతగా ప్రవర్తిస్తున్న నాగార్జున!

అఖిల్ పెళ్లి రద్దు: సెట్స్‌లో వింతగా ప్రవర్తిస్తున్న నాగార్జున!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొన్ని నెలలుగా అక్కినేని ఫ్యామిలీ అంతా సందడి గా కనపించింది. నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య వివాహంతో పాటు చిన్న కుమారుడు అఖిల్ వివాహం సెట్టవ్వడమే ఇందుకు కారణం. తర్వాత అఖిల్ ఎంగేజ్మెంట్, ఆ వెంటనే చైతన్య నిశ్చితార్థం లాంటి ఈవెంట్లతో ఇటు అభిమానుల్లోనూ ఆనందం.

అయితే గత పది రోజులుగా అక్కినేని ఫ్యామిలీలో సందడి అంతా మాయమైంది. ఎవరూ ఊహించని విధంగా ఉన్నట్టుండి అఖిల్ పెళ్లి రద్దవ్వడమే ఇందుకు కారణం అని అంటున్నారు. ఈ ఘటనతో నాగార్జున చాలా అప్ సెట్ అయ్యారని, సినిమా సెట్స్ లో కూడా ఆయన ప్రవర్తన గతంలో ఎన్నడూ లేని విధంగా విచిత్రంగా ఉంటోందని అంటున్నారు.

రాజు గారి గది 2

రాజు గారి గది 2

ప్రస్తుతం నాగార్జున రాజుగారి గది 2 సినిమాలో చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన మెంటలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. సెట్స్ లో ఎప్పుడూ సరదాగా ఉండే నాగార్జున ఇపుడు చాలా మూడీగా ఉంటున్నారని, తన షూటింగ్ పోర్షన్ పూర్తవ్వగానే ఎవరితో మాట్లాడకుండా ఓ మూలన కూర్చుంటున్నారని తెలుస్తోంది.

ఇది నిజంగా నిజమా?

ఇది నిజంగా నిజమా?

అంతే కాదు... అఖిల్ ఇన్సిడెంట్ తర్వాత నాగార్జున ఫోన్ నెంబర్ కూడా మార్చారట. అఖిల్, శ్రీయ భూపాల్ మధ్య ఏం జరిగింది? గొడవకు కారణం ఏమిటి? అనే విషయాలు తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్ చేస్తుండటం వల్లే ప్రస్తుతానికి తన నెంబర్ ఆఫ్ లో పెట్టి వేరే నెంబర్ వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పెళ్లి రద్దు: అఖిల్‌నే తప్పుపడుతున్నారు, చైతు-సమంతకు కొత్త తలనొప్పి!

పెళ్లి రద్దు: అఖిల్‌నే తప్పుపడుతున్నారు, చైతు-సమంతకు కొత్త తలనొప్పి!

పెళ్లి రద్దు విషయంలో అందరూ అఖిల్ నే తప్పు పడుతున్నారు. మరో వైపు ఈ సంగటన నాగ చైతన్య, సమంతలకు కొత్త తలనొప్పిగా తయారైందట. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అఖిల్ పెళ్లి కేన్సిల్ ఇష్యూ.... అవకాశం కూడా ఇవ్వని అమల అక్కినేని!

అఖిల్ పెళ్లి కేన్సిల్ ఇష్యూ.... అవకాశం కూడా ఇవ్వని అమల అక్కినేని!

టాలీవుడ్లో ఇపుడు మోస్ట్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే... అది అఖిల్ అక్కినేని పెళ్లి రద్దు అంశమే. ప్రముఖ వ్యాపారవేత్త జీవికె రెడ్డి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి శ్రీయా భూపాల్‌తో అఖిల్ ప్రేమాయణం, చిన్న వయసులోనే పెళ్లిపై నిర్ణయం తీసుకోవడం.... ఓ సంచలనం. నిశ్చితార్థం కూడా పూర్తయి మరికొన్ని రోజుల్లో పెళ్లి వేడుక జరుగుతుంది అనే సమయంలో వీరిద్దరు పెళ్లి రద్దు చేసుకున్నారనే వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Ever since the news of Akhil's engagement with designer Shriya Bhupal was cancelled and the couple's wedding in May in Italy was called off, actor Nagarjuna is said to be in an utter shock. The actor is apparently very unhappy over it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more